Devara movie Release tomorrow Inspections in theaters in Ibrahimpatnam
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్ల ముందు ఫ్యాన్స్ కటౌట్ లను ఏర్పాటు చేస్తూ తమ సంబరాలను ప్రారంభించారు. అటు తెలుగు రాష్ట్రాలు సైతం టికెట్ల రేటు పెంపునకు అనుమతులను ఇచ్చాయి.
ఇప్పటికే టికెట్ల విక్రయాలు మొదలు అయ్యాయి. దేవర సినిమా చూసేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. ఇదే అదునుగా కొన్ని థియేటర్లలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇబ్రహీంపట్నంలోని దేవర చిత్రం విడుదల అవుతున్న థియేటర్లలో ఇతహసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేశారు. అర్థరాత్రి షోకు ముందుగానే అధిక రేట్లకు టికెట్లను విక్రయించినట్లుగా బయటపడింది.
Bigg Boss 8 : నిఖిల్ పై విష్ణు ప్రియ ఫైర్.. మైక్ పడేసి వెళ్లిపోయిన మణికంఠ..
థియేటర్ అనుమతి, అధిక షోలకు అనుమతులు, టికెట్ల పెంపుపై అనుమతుల గురించి విచారించారు. అయితే.. వీటికి సమాధానం ఇవ్వటంలో థియేటర్ యాజమాన్యం తడబడుతోంది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో థియేటర్ల యాజమానుల్లో వెన్నులో వణుకు మొదలైంది.