NTR : కొత్త కారు కొన్న ఎన్టీఆర్.. ఆ కారు విలువ ఎంతో తెలుసా..

కొత్త కారు కొన్న ఎన్టీఆర్. దాని రిజిస్ట్రేషన్ కోసం నేడు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. ఇంతకీ ఆ కారు విలువ ఎంతో తెలుసా..

Devara star NTR purchase new brand model car price

NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే రావాల్సిన ఈ చిత్రం.. షూటింగ్ లేట్ అవ్వడంతో అక్టోబర్ కి పోస్టుపోన్ అయ్యింది. ఇది ఇలా ఉంటే, ఎన్టీఆర్ తాజాగా ఓ కొత్త కారుని కొన్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం నేడు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో కాలింగ్ గ్లాస్సెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాగా కొత్తగా కొన్న కారు కలర్ ‘నౌటిక్ బ్లూ’లా కనిపిస్తుంది.. ఇక కారు మోడల్ విషయానికి వస్తే.. Mercedes-Benz Maybach S-Class S 580. మార్కెట్ లో దీని విలువ దాదాపు రూ.2.72 కోట్లు చూపిస్తుంది. కాగా ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. Mercedes-Benz GLS, Lamborghini Urus, Range Rover Vogue, BMW 7-Series, Porsche 718 Cayman మోడల్ కార్లు ఎన్టీఆర్ దగ్గర ఉన్నట్లు సమాచారం.

Also read : Prabhas : ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌కి జోడిగా కీర్తి సురేష్.. నిజమేనా..!

ఇక దేవర విషయానికి వస్తే.. ఇటీవలే గోవాలో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసారు. అక్కడ ఎన్టీఆర్ పై ఓ సాంగ్‌ని, కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి పార్టుని దసరా సమయంలో అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు