Devi Sri Prasad : పుష్ప నిర్మాతలపై నవ్వుతూనే ఫైర్ అయిన దేవిశ్రీ ప్రసాద్.. నా మీద మీకు ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి..

తాజాగా జరిగిన పుష్ప 2 చెన్నై ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..

Devisri Prasad Sensational Comments on Producers at Pushpa 2 Wildfire Chennai Event

Devi Sri Prasad : నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వైల్డ్ ఫైర్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పుష్ప 2 టీమ్ అంతా హాజరయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 2 మ్యూజిక్ విషయంలో వివాదం నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తమన్, అజనీష్, మరికొందరు కూడా మ్యూజిక్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. తమన్ కూడా నేను పుష్ప 2 కి పనిచేసాను అని చెప్పాడు.

తాజాగా జరిగిన పుష్ప 2 చెన్నై ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. మనకు ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అయినా, క్రెడిట్ అయినా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. రవి శంకర్ సర్ నేను స్టేజిపై ఎక్కువ టైం తీసుకుంటున్నాని అని అనొద్దు. నేను సమయానికి పాట ఇవ్వలేదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదు, టైం కి ప్రోగ్రాంకి రాలేదు అంటారు. మీకు నా మీద చాలా ప్రేమ ఉంది కానీ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాంగ్ టైమింగ్ అన్నారు. ఇలాంటివి పర్సనల్ గా అడిగితే కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటూనే బాగుంటుంది అని నవ్వుతూనే నిర్మాతల మీద ఫైర్ అయ్యాడు.

Also Read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

దీంతో దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇటీవల పుష్ప 2 మ్యూజిక్ విషయంలో అనేక వార్తలు, వివాదాలు వచ్చాయి. దీనిపై దేవిశ్రీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసాడట. రెమ్యునరేషన్, క్రెడిట్ గురించి, సాంగ్స్ లేట్ అయింది అనడం గురించి దేవిశ్రీ అన్ని మాట్లాడటంతో దేవిశ్రీ పై ప్రెజర్ పెట్టారా? లేక నిర్మాతలకు, దేవిశ్రీకు మధ్య ఏదైనా జరిగిందా అని ఇప్పుడు చర్చగా మారింది.