Dhanush-Mrunal Thakur : ధనుష్–మృణాల్ ప్రేమ కథకు బ్రేకప్ ట్విస్ట్?

ధ‌నుష్, మృణాల్ ఠాకూర్‌లు డేటింగ్‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా తాజాగా వీరిద్ద‌రు (Dhanush-Mrunal Thakur ) విడిపోయార‌ని జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Dhanush and Mrunal Thakur break up rumours viral

Dhanush-Mrunal Thakur : త‌మిళ స్టార్ హీరో ధనుష్‌, న‌టి మృణాల్ ఠాకూర్ లు డేటింగ్ చేస్తున్నార‌ని గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. ప‌లు కార్య‌క్ర‌మాల్లో వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించ‌డం, వైర‌ల్ వీడియోలు ఈ ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూర్చాయి. ప్రముఖ సినీ పత్రిక ఫిల్మ్‌ఫేర్ ప్రచురించిన తాజా కథనం ఈ ప్ర‌చారాన్ని మ‌రో మలుపు తిప్పింది. ధనుష్‌, మృణాల్ తమ సంబంధాన్ని ముగించుకున్నారని ఆ కథనంలో పేర్కొంది.

ధనుష్, మృణాల్ ఇప్పుడు తమ తమ మార్గాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇద్దరికీ సన్నిహితంగా ఉన్న వర్గాలు వెల్లడించిన‌ట్లు తెలిపింది. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదని అంది. ఇదిలా ఉంటే.. బ్రేక‌ప్ వార్త‌ల‌ గురించి అటు మృణాల్‌, ఇటు ధ‌నుష్‌లు ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

Venky Anil 5 : వెంకీ డబుల్ రోల్.. మరో ప్రయోగం చేయబోతున్న అనిల్!

కాగా.. ధనుష్, మృణాల్ మధ్య సంబంధంపై చ‌ర్చ తొలిసారి ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ సందర్భంగా మొద‌లైంది. ఆ వేడుకకు హాజరైన ధనుష్.. మృణాల్‌తో ఆత్మీయంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు వారి బంధంపై ఊహాగానాలు మొదలుపెట్టారు. అనంతరం ధనుష్ నటిస్తున్న ‘తేరే ఇష్క్ మేన్’ చిత్ర ర్యాప్-అప్ పార్టీలో మృణాల్ కనిపించడం, అలాగే ధనుష్ సోదరీమణులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడం వంటి అంశాలు ఈ ప్రచారాన్ని మరింత బ‌లాన్ని ఇచ్చాయి.

ఇదిలా ఉంటే.. గతంలో ఈ డేటింగ్ రూమర్లపై మృణాల్ ఠాకూర్ స్పందించింది. వాటిని ఆమె పూర్తిగా ఖండించింది. అందులో ఎలాంటి నిజం లేదంది. ధనుష్ తనకు మంచి స్నేహితుడేనని పేర్కొంది. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కార్యక్రమానికి అజయ్ దేవగన్ ఆహ్వానం మేరకే వెళ్లాన‌ని వివ‌రించింది. తన వ్యక్తిగత జీవితం కంటే సినిమాలు, నటన గురించే ప్రజలు మాట్లాడాలని కోరుకున్న మృణాల్, ప్రేమలో పడితే దాన్ని దాచిపెట్టకుండా స్వయంగా ప్రకటిస్తానని తెలిపింది.