Venky Anil 5 : వెంకీ డబుల్ రోల్.. మరో ప్రయోగం చేయబోతున్న అనిల్!
వెంకీ, అనిల్ రావిపూడి కొత్త సినిమాపై (Venky Anil 5) ఓ గాసిప్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.
Gossip Garage Venkatesh double role in Venky Anil 5 movie
Venky Anil 5 : ప్రతీ సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ నుంచి సినిమా రావాల్సిందే అన్నట్లుగా మారిపోయింది సీన్. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి..నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ ఫినీష్ చేసి మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నాడు.
విక్టరీ వెంకటేష్, కల్యాణ్‌రామ్‌తో తీయబోయే మల్టీస్టారర్ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో మరోసారి వెంకీతో ప్రయోగం చేయబోతున్నాడట అనిల్. అయితే ఈ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి ఫుల్ వైరల్ అవుతోంది.
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన నిషా అగర్వాల్..
వెంకటేష్ ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడని, ఒక సైడ్ ఫ్యామిలీ మ్యాన్, మరొక సైడ్ యాక్షన్ హీరో లాంటి డ్యుయల్ షేడ్స్‌తో వస్తున్నాడని టాక్. ఈ డబుల్ రోల్ ట్విస్ట్ సినిమాకు మరింత హైప్‌ను తీసుకురావడం ఖాయమంటున్నారు. కీర్తి-వెంకీ, కృతి-కల్యాణ్ రామ్ జోడీలపై కూడా ట్విస్ట్ ఉంటుందని టాక్.
ఈ మూవీలో వెంకీ డబుల్ రోల్ నిజమైతే ఇది వెంకటేష్ కెరీర్లో మరో బిగ్ సర్ప్రైజ్ అవుతుందంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టైల్లో ఈ సినిమా తీస్తున్నా.. డ్యూయల్ రోల్ ఎలిమెంట్ జోడిస్తే మాత్రం మాస్, ఎమోషనల్ డ్రామా బాగా వర్కౌట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. జూన్ 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుండటంతో..త్వరలోనే క్లారిటీ రాబోతోంది. ఈ మూవీలో వెంకీ డబుల్ రోల్ నిజమా? లేదా జస్ట్ హైప్ కోసం వచ్చిన టాకా? వెంకీ ఫ్యాన్స్‌కి ఎగ్జైట్మెంట్కు క్లారిటీ ఎప్పుడనేదే సస్పెన్స్‌గా మారింది.
