Captain Miller : సలార్, దేవరని ఫాలో అవుతున్న కెప్టెన్ మిల్లర్.. ఏ విషయంలో తెలుసా..?

ప్రభాస్ 'సలార్', ఎన్టీఆర్ 'దేవర' తరహాలోనే ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' కూడా రాబోతుందట.

Dhanush Captain Miller is following ntr devara prabhas salaar

Captain Miller : తమిళ్ హీరో ధనుష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కెప్టెన్ మిల్లర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల ఒక చిన్న టీజర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసింది. శాండిల్ వుడ్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. డిసెంబర్ 15న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. ప్రభాస్ ‘సలార్’, ఎన్టీఆర్ ‘దేవర’ తరహాలోనే ఈ సినిమా కూడా రాబోతుందట. ఇంతకీ కెప్టెన్ మిల్లర్ ఏ విషయంలో సలార్, దేవరని ఫాలో అవుతున్నాడు..? ఈమధ్య కాలంలో మేకర్స్ అంతా తమ సినిమాలను చాలా వైడ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే తమ చిత్రాలను ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే తరహాలో కెప్టెన్ మిల్లర్ కూడా రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుందట.

Also read : Bigg Boss 7 : మళ్ళీ తిరిగొచ్చిన ఆ ముగ్గురు కంటెస్టెంట్స్.. బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ మాములుగా లేదుగా..

ఈ విషయం గురించి మూవీ టీం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. తమిళ ప్రముఖ సినిమా పిఆర్ ‘మనోబాల విజయ్ బాలన్’ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశాడు. అలాగే మరో అందాలభామ ‘అదితి బాలన్’ ఈ సినిమాలో నటించబోతుందట. సెకండ్ పార్ట్ లో ఈమె పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. జివి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. బ్రిటిష్ కాలం నాటి కథతో ఒక యాక్షన్ అడ్వెంచర్ కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది.