Kara First Review : ధనుష్ ‘కర’ సినిమా ఫస్ట్ రివ్యూ.. దొంగగా ధనుష్.. మళ్ళీ హిట్ కొడతాడా?

కర సినిమా ఏప్రిల్ 30న తమిళ్, తెలుగులో రిలీజ్ కాబోతుంది. (Kara First Review)

  • Updated on- April 29, 2026 / 10:55 AM IST

Dhanush Kara First Review

Kara First Review : తమిళ్ స్టార్ హీరో ధనుష్ మిగతా హీరోల కంటే ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. గతేడాది కుబేర, ఇడ్లీ కొట్టు, తేరే ఇష్క్ మేన్ ఇలా ఏకంగా మూడు సినిమాలతో వచ్చి మూడు సినిమాలకు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు కర సినిమాతో రాబోతున్నాడు ధనుష్. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌‌‌ పై ఐషరి కె గణేష్ నిర్మాణంలో విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్, మమిత బైజు జంటగా ఈ సినిమా తెరకెక్కింది. కర సినిమా ఏప్రిల్ 30న తమిళ్, తెలుగులో రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ అయిపొయింది. సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చింది. తమిళ్ లో కూడా పలువురు సెలబ్రిటీలు, మూవీ యూనిట్ ఈ సినిమాని చూసేసారు. దీంతో తమిళ మీడియాలో ఈ సినిమా గురించి చర్చిస్తున్నారు.

Also Read : Bandhavi Sridhar : మసూద భామ బర్త్ డే సెలబ్రేషన్స్.. బాంధవి శ్రీధర్ ఫొటోలు..

కథ విషయానికొస్తే.. ఇది 90వ దశకంలో తమిళనాడులోని ఓ గ్రామంలో జరిగే కథ. కర స్వామి పాత్రలో ధనుష్ నటించాడు. కరస్వామి ఓ దొంగ. అతనిపై అందరికి చెడు అభిప్రాయం ఉంటుంది. కానీ అనుకోకుండా జరిగిన సంఘటనలతో దొంగతనాలు మానేసి మాములు లైఫ్ బతుకుతుంటాడు. అలాంటి సమయంలో ఓ అత్యవసరంతో మళ్ళీ బ్యాంకులను దొంగతనం చేస్తాడు. దీంతో పోలీసులు కరస్వామిని పట్టుకోడానికి వెతుకుతారు. మరో పక్క భార్య కూడా కరస్వామిని ప్రశ్నిస్తుంది దొంగతనాలు ఎందుకు అని. అసలు కరస్వామి ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? అతను మంచోడిగా మారాడా? కరస్వామి కి దొంగతనాలు చేయాల్సిన అవసరం ఏంటి? పోలీసులు పట్టుకున్నారా అనేది తెరపై చూడాల్సిందే.

ఈ సినిమా విశ్లేషణ చూస్తే.. ఇది ఒక సస్పెన్స్ డ్రామా సినిమా. కరస్వామి చేసే దొంగతనాలు, అతని గురించి పోలీసులు వెతికే సీన్స్ చాలా ఆసక్తిగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విధంగా ఉంటాయని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నా సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ అని టాక్. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉండనుంది. ధనుష్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ కూడా హైలెట్ గా నిలవనున్నాయి. ధనుష్ ఎప్పట్లాగే తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. ఇన్నాళ్లు క్యూట్ గా కనిపించిన మమిత బైజు ఈ సినిమాలో మాత్రం డీ గ్లామరైజ్ రోల్ లో అదరగొట్టేసింది. ఎమోషనల్ సీన్స్ ని కూడా బాగా పండించిందని సమాచారం.

సింపుల్ పాత కథే అయినా ఆసక్తికర స్క్రీన్ ప్లేతో బాగానే తెరకెక్కించారట. ఈ సినిమా డైరెక్టర్ విగ్నేష్ రాజా మొదటి సినిమా పోర్ థోజిల్ పెద్ద హిట్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా అందర్నీ మెప్పించింది. ఈ సినిమాలో సస్పెన్స్ ఉన్నా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారంట. ఇక ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూసాక మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తన సోషల్ మీడియాలో.. నేను ఆల్రెడీ సినిమా చూశాను. సినిమా బాగా వచ్చింది. ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్. ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుంది అని తెలిపారు. ఈ సినిమా రన్ టైం 2 గంటల 41 నిముషాలు. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సిటిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం 90s బ్యాక్ డ్రాప్ అయినా కొన్ని చోట్లా ఆ ఫీల్ రాలేదని టాక్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసారు.

Also Read : Pooja Hegde: మన ఊరి అమ్మాయిలా మెరిసిపోతున్న పూజ.. క్రేజీ క్యాప్షన్‌తో నెటిజన్ల ఫిదా

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలపై సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ విడుదల చేస్తున్నారు. మరి కర సినిమాతో ధనుష్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు, కమర్షియల్ గా ఎంత కలెక్ట్ చేస్తాడో తెలియాలంటే రేపటి దాకా ఎదురు చూడాల్సిందే.