Dhanush Political Party : విజయ్‌కి పోటీగా ధనుష్ పొలిటికల్ పార్టీ.. పేరు ఇదే.. 2031 ఎన్నికల్లో బరిలోకి..?
విజయ్ సీఎం అవ్వడంతో మిగతా నటీనటులకు కూడా పాలిటిక్స్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. (Dhanush Political Party)
- Saketh U
- Published on- October 8, 2026 / 03:53 PM IST
Dhanush Political Party
Dhanush Political Party : తమిళనాడు రాజకీయాలు సినిమా వాళ్ళు లేకుండా జరగవని తెలిసిందే. MGR నుంచి రీసెంట్ తమిళనాడు సీఎం విజయ్ వరకు ఎంతోమంది తమిళ నటీనటులు అక్కడ రాజకీయాల్లో చక్రం తిప్పారు, పార్టీలు పెట్టారు. అయితే ఇటీవల విజయ్ ఎన్నికలకు రెండేళ్ల ముందు పార్టీ పెట్టి ఒక సంవత్సరం ముందు ప్రజల్లో తిరిగి అనూహ్యంగా సీఎం అయిన సంగతి తెలిసిందే. విజయ్ సీఎం అవ్వడంతో మిగతా నటీనటులకు కూడా పాలిటిక్స్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇప్పటికే రాఘవ లారెన్స్, త్రిష, విశాల్.. ఇలా పలువురు తమిళ నటీనటులు రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. శివ కార్తికేయన్ కూడా పార్టీ పెడతాడు అని ఇటీవల తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ధనుష్ పొలిటికల్ పార్టీ గురించి మరోసారి చర్చ మొదలైంది. ధనుష్ రాజకీయాల్లోకి వస్తాడు అని గతంలోనే వార్తలు వచ్చాయి.
తాజా తమిళ మీడియా సమాచారం ప్రకారం ధనుష్ పేరిట ఆయన అభిమానులు ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారట. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళనాడు అభ్యుదయ పార్టీ) పేరుతో ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేయించినట్లు తెలుస్తుంది. 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ధనుష్ త్వరలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నట్టు సమాచారం.
త్వరలోనే ధనుష్ ఈ పార్టీ విధివిధానాలు అధికారికంగా ప్రకటిస్తారని ధనుష్ ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ధనుష్ మాజీ మామ, సూపర్ స్టార్ రజినీకాంత్ సపోర్ట్ కూడా ధనుష్ కి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ధనుష్ బీజేపీకి కొంత సపోర్ట్ గా ఉంటాడని తెలిసిందే. కొత్త పార్టీ పెట్టి తమిళనాడులో బీజేపీ సపోర్ట్ తో పోటీ చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ధనుష్ సన్నిహితులు మాత్రం ధనుష్ ఎలాంటి పార్టీ రిజిస్ట్రేషన్ చేయించలేదని, చేయించింది ఎవరో తమకు తెలియదని తమిళ మీడియాతో చెప్పారు. మరి వీటిపై క్లారిటీ రావాలంటే ధనుష్ స్పందించాల్సిందే.
Also See : Anchor Manjusha : హాఫ్ శారీలో అందంగా.. యాంకర్ మంజూష క్యూట్ ఫోటోలు వైరల్..
