Flop Movie Sequel : దర్శకుడు, హీరో, నిర్మాత అందరూ ఫ్లాప్స్‌లో.. ఇలాంటి టైంలో ఫ్లాప్ సినిమాకు సీక్వెల్.. అవసరమా?
తాజాగా ఓ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు హీరో, దర్శకుడు, నిర్మాత. (Flop Movie Sequel)
Flop Movie Sequel
Flop Movie Sequel : తాజాగా ఓ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు హీరో, దర్శకుడు, నిర్మాత. ఇంతకీ అదేం సినిమా, ఎవరు ప్రకటించారు అనుకుంటున్నారా? ఒకప్పుడు భారీ విజయం సాధించిన ఇండియన్(భారతీయుడు) సినిమాకు 2024 లో ఇండియన్ 2 అని సీక్వెల్ వచ్చి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996 లో అవినీతి, లంచం కాన్సెప్ట్ మీద స్వతంత్ర పోరాటయోధుడు చేసిన పోరాటం అనే కథాంశంతో వచ్చిన ఇండియన్ సినిమా భారీ విజయం సాధించింది.
ఈ సినిమాకు సీక్వెల్ గా 2024 లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్ కూడా కీలక పాత్రల్లో ఇండియన్ 2 తెరకెక్కింది. కానీ ఈ సినిమా అన్ని భాషల్లో ఫ్లాప్ గానే మిగిలింది. అప్పుడే ఈ సినిమాకు పార్ట్ 3 అనౌన్స్ చేసారు. పార్ట్ 3కి కొంత షూటింగ్ కూడా చేసారు. ఇండియన్ 2 ఫ్లాప్ అయ్యాక, లైకా కూడా వరుస ఫ్లాప్స్ లో ఉండటం, శంకర్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడంతో ఇండియన్ 3 సినిమా ఉండదనే అనుకున్నారు. తమిళ మీడియా సమాచారం ప్రకారం కూడా నిర్మాతకు, దర్శకుడికి ఫైనాన్షియల్ సమస్యలు వచ్చి ఇండియన్ 3 ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.
Also See : Anchor Manjusha : హాఫ్ శారీలో అందంగా.. యాంకర్ మంజూష క్యూట్ ఫోటోలు వైరల్..
కానీ సడెన్ గా నేడు ఇండియన్ 3 మొదలయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. వార్ మోడ్ అంటూ ఓ ముగ్గురు గుర్రాల మీద వెళ్తున్నట్టు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. మిగిలిన షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. దీంతో వరుస ఫ్లాప్స్ లో ఉన్న నిర్మాత, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూసిన దర్శకుడు, హీరోలు కలిసి ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు సినీ అభిమానులు. మరో భారతీయుడు 3 సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Senapathy is back with zero tolerance. 🔥 The resurgence begins in #Indian3 🇮🇳 War Mode. ⚔️
Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @anirudhofficial #Siddharth @MSKajalAggarwal @priya_Bshankar @actorsimha @iam_SJSuryah @dop_ravivarman @muthurajthangvl @sundarksam @teamaimpr
#Hindustani3 🇮🇳 #Bharateeyudu3 🇮🇳 #WarMode
— Lyca Productions (@LycaProductions) October 8, 2026
