Dhurandhar 2: తొమ్మిదేళ్ల నాటి రికార్డ్ తొమ్మిది రోజులు అవుట్.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన ధురంధర్ 2

నార్త్ అమెరికాలో బాహుబలి పేరిట ఉన్న హైయ్యెస్ట్ గ్రాసర్ రికార్డ్ ను బ్రేక్ చేసిన ధురంధర్ 2(Dhurandhar 2).

Dhurandhar 2 has broken the records set by Baahubali 2

  • ధురంధర్ 2 దెబ్బకు బాహుబలి 2 అవుట్
  • నార్త్ అమెరికాలో హైయ్యెస్ట్ గ్రాసర్ గా ధురంధర్
  • 22.1 మిళియన్స్ కలెక్షన్స్ తో టాప్ పొజిషన్

Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సృష్టిస్తున్న సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా రూ. 1200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఇప్పటికే సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ సినిమా, తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి 2’ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును ‘ధురంధర్ 2(Dhurandhar 2)’ బ్రేక్ చేసింది.

Sreemukhi: లగ్జరీ కార్‌తో క్రేజీ లుక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీముఖి ఫోటోలు

ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం చూపిస్తున్న ప్రతాపం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ తన లాంగ్ రన్‌లో 22 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి రికార్డ్స్ నిలిచింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు విడుదలైనప్పటికీ ఈ రికార్డును చేరుకోవడం ఎవరికీ సాధ్యపడలేదు.

అయితే, ‘ధురంధర్ 2’ కేవలం 9 రోజుల్లోనే 22.1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది. ఒక సినిమా తన లాంగ్ రన్‌లో సాధించిన మైలురాయిని, ధురంధర్ 2 కేవలం పది రోజులు కూడా గడవకముందే అధిగమించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే, ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సమయానికి మరిన్ని అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేసేలా కనిపిస్తోంది.