Dhurandhar 2 OTT: అనుకున్న డేట్ కంటే ముందే.. ఓటీటీకి వచ్చేస్తున్న ధురంధర్ 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధం అవుతున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ 2(Dhurandhar 2 OTT) మూవీ.

dhurandhar 2 ott streaming update

  • ధురంధర్ 2 మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది
  • సెప్టెంబర్‌ నుంచి జూన్ కి ప్రీ పోన్
  • అయితే ఈసారి నెట్‌ఫ్లిక్స్‌లో కాదు

Dhurandhar 2 OTT: ‘ధురంధర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మూడు వారాల్లోనే దాదాపు రూ.1700 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ మూవీ, త్వరలోనే 1800 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రభావం, సుదీర్ఘమైన రన్ టైం కారణంగా 2000 కోట్ల లక్ష్యం కష్టమనిపిస్తున్నా, ఇప్పటికీ థియేటర్లలో డీసెంట్ వసూళ్లను రాబడుతూ తన సత్తా చాటుతోంది.

Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం.. షూటింగ్ సామాగ్రి దగ్ధం

ఈ చిత్రం ఓటీటీ విడుదలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై రికార్డులు సృష్టించడంతో(Dhurandhar 2 OTT), రెండో భాగానికి కూడా ఆ సంస్థ రూ.250 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చింది. అయితే, మేకర్స్ ఆ ఆఫర్ ను తిరస్కరించి, తమ సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ‘జియో హాట్ స్టార్’ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకోవడం విశేషం.

ముందుగా సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ చేయాలనుకున్నప్పటికీ, థియేట్రికల్ రన్ క్రమంగా తగ్గుతుండటంతో మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలోనే డిజిటల్ ప్రీమియర్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారికి, ఇంటి వద్దే వీక్షించాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.