Dasara Movie: దసరా మూవీకి అక్కడ కనీస ఆదరణ లేదంటోన్న క్రిటిక్స్.. నిజమేనా?
నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే, ఈ సినిమాకు ఒకచోట మాత్రం కనీస ఆదరణ కరువయ్యిందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
- Anil Aaleti
- Published On : April 8, 2023 / 04:57 PM IST
Did Dasara Movie Failed Big At North Belt
Dasara Movie: నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘ దసరా’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఊరమాస్ అవతారంలో నాని ఈ సినిమాలో నటించగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు ఈ హీరో.
Dasara Movie : 100 కోట్ల దసరా.. నాని కెరీర్ లో సూపర్ సక్సెస్ సినిమా..
రిలీజ్ తరువాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతోంది. రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే, నిజంగానే నాని సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కిందా అనే సందేహం ఇప్పుడు సినీ క్రిటిక్స్‌లో వినిపిస్తోంది. తాజాగా వారు ఈ సినిమా లెక్కలు చూసి ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. దసరా మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంతో సహా నార్త్ బెల్ట్‌లోనూ ఈ సినిమాతో సందడి చేయాలని నాని చూశాడు. అందుకే, హిందీ ప్రమోషన్స్ కోసం నాని చాలా కష్టపడ్డాడు.
Dasara Movie: వెన్నెల మాస్ డ్యాన్స్.. వావ్ అంటోన్న కీర్తి సురేష్ ఫ్యాన్స్!
కానీ, అక్కడ ఈ సినిమాకు రిలీజ్ రోజునే ప్రేక్షకులు పెద్దగా ఇంప్రెస్ కాలేదనే టాక్ వచ్చింది. దీంతో అక్కడ ఈ సినిమాకు కనీస ఆదరణ కరువయ్యిందనే టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దసరా మూవీకి హిందీ భాషలో కనీస కలెక్షన్స్ కూడా రావడం లేదని బాలీవుడ్ మూవీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అంటే.. ఈ లెక్కన, దసరా వంద కోట్ల బిజినెస్ కేవలం దక్షిణాది భాషలతోనే సాధ్యమయ్యిందా అనే సరికొత్త ప్రశ్న ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలపై దసరా యూనిట్ ఏదైనా రెస్పాన్స్ ఇస్తుందా అనేది చూడాలి.
