RC 15 : అవి షేర్ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు
ఇటీవల మహేష్ బాబు సినిమా సాంగ్, పవన్ కళ్యాణ్ షూటింగ్ స్టిల్స్.. ఇలా స్టార్ హీరోల సినిమాల నుంచి లీక్స్ అవుతున్నాయి. ఇలాంటి లీక్స్ ఎప్పట్నుంచో ఇండస్ట్రీలో చిత్ర నిర్మాణ సంస్థలకి......
- Saketh U
- Updated on- February 17, 2022 / 06:33 AM IST
Rc 15
Ram Charan : రామ్చరణ్, కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ముంబై, పూణేలలో రెండు షెడ్యూల్స్ షూట్ చేశారు. తాజాగా మూడో షెడ్యూల్ షూటింగ్ ని మొదలు పెట్టారు.
ప్రసుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండబోతుంది. ఒక పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలని కూడా తెరకెక్కించనున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇటీవల అన్ని సినిమాలకు ఈ లీకుల బెడద తప్పట్లేదు. దీంతో ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ సీరియస్ అయి ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేసింది.
Natural Star : నాని ‘దసరా’ మొదలైంది..
చిత్ర నిర్మాణ సంస్థ.. ”కథ రీత్యా ఎక్కువమంది జనం ఉండే ఓపెన్ ఏరియాల్లో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో మా సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి, చట్టవిరుద్ధంగా షేర్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మేం తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. మా యాంటీ పైరసీ టీం వీటిపై రోజూ పనిచేస్తూనే ఉంటుంది. దయచేసి సహకరించండి’’ అని తెలిపారు.
Chiranjeevi : బ్యాక్ టు బ్యాక్ మెగాస్టార్ సినిమాల్లో అనసూయ
ఇటీవల మహేష్ బాబు సినిమా సాంగ్, పవన్ కళ్యాణ్ షూటింగ్ స్టిల్స్.. ఇలా స్టార్ హీరోల సినిమాల నుంచి లీక్స్ అవుతున్నాయి. ఇలాంటి లీక్స్ ఎప్పట్నుంచో ఇండస్ట్రీలో చిత్ర నిర్మాణ సంస్థలకి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ ఇలాంటి ప్రకటన ఇవ్వడంతో మరి ఈ లీకుల బెడద తప్పుతుందేమో చూడాలి.
