Raavanam: ‘రావణం’ అల్లు అర్జున్ తోనే.. ప్రశాంత్ నీల్ ను సెట్ చేసిన దిల్ రాజు
అల్లు అర్జున్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో రావణం (Raavanam)సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.
- V Santhosh Kumar
- Published on- April 22, 2026 / 11:15 AM IST
Dil Raju producing Raavanam movie with Allu Arjun and Prashanth Neel
- అల్లు అర్జున్- ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ
- రావణం కోసం అంతా సెట్ చేస్తున్న దిల్ రాజు
- ప్రభాస్ కాదు అల్లు అర్జున్ ఫైనల్
Raavanam: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’తో గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందుకే తన తరువాతి సినిమాలపై ఒక రేంజ్ లో అంచనాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీతో సినిమా హాలీవుడ్ రేంజ్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా అదే రేంజ్ లో సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కలను మార్చేసిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో బన్నీ చేతులు కలపనున్నాడు.
Aditi Gautam: నాభి అందాలతో నషా ఎక్కిస్తున్న అదితి గౌతమ్.. క్రేజీ పోజులకు నెటిజన్స్ మైండ్ బ్లాక్
ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు స్టార్స్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘రావణం(Raavanam)’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలోనే ఇదే టైటిల్ తో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాబోలో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు దిల్ రాజు. కానీ, అనుకోని కారణాల వల్ల అల్లు అర్జున్ తో ఆ సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు.
పురాణాల్లో రావణుడి తరహాలో ఉండే ఒక పవర్‌ఫుల్, గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో అల్లు అర్జున్‌ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇద్దరి స్టైల్స్ కలిస్తే వెండితెరపై హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండగా, అల్లు అర్జున్ తన ఇతర కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది.
