×
Ad

Dil Raju – Vaishnavi Chaitanya : స్టేజి పై పాట పాడి అదరగొట్టిన దిల్ రాజు, వైష్ణవి చైతన్య..

'రావాలి రా' అంటూ స్టేజి పై పాట పాడి అదరగొట్టిన దిల్ రాజు, వైష్ణవి చైతన్య.

  • Published On : March 30, 2024 / 05:14 PM IST

Dil Raju Vaishnavi Chaitanya sang Raavaali Raa Song from Love Me movie

Dil Raju – Vaishnavi Chaitanya : దిల్ రాజు నిర్మాతగా ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆల్రెడీ ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. పోస్టర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే నేడు ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు.

‘రావాలి రా’ అంటూ సాగే మెలోడీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాటకి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ లిరిక్స్ రాసారు. ఇక ఈ పాటని అమల చేబోలు, గోమతి ఐయర్, అదితి భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్వీన్, సాయి శ్రేయ సింగర్స్ తో పాటు హీరోయిన్ వైష్ణవి కూడా పాడారు. ఇందుకోసం కీరవాణి, వైష్ణవికి వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారట.

Also read : Karthi – Vijay Deverakonda : స్టేజిపై కార్తీ – విజయ్ దేవరకొండ డ్యాన్స్ చూసారా?.. వైరల్ అవుతున్న వీడియో..

ఇక ఈ పాటని సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు, వైష్ణవి చేత పాడించారు. అంతేకాదు తాను హమ్ చేసారు. దిల్ రాజుకి సంగీతం పై మంచి పట్టు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో నాగచైతన్య ‘జోష్’ సినిమాలో ‘అన్నయోచ్చినాడో’ అనే పాటని పాడి అందర్నీ ఆకట్టుకున్నారు. నేడు జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో వేదిక పై వైష్ణవి చైతన్యతో కలిసి దిల్ రాజు కూడా రాగం పడుతూ ఆకట్టుకున్నారు.

ఇప్పుడు కేవలం చిన్న బిట్ పాడిన వైష్ణవి చైతన్య.. రేపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫుల్ సాంగ్ ని స్టేజి పై పడుతుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్య కాకుండా మరో నలుగురు హీరోయిన్స్ గెస్ట్ అపిరెన్స్ కూడా ఉండబోతుందట. అయితే ఈ హీరోయిన్స్ ఎవరు అన్నది మాత్రం థియేటర్స్ లోనే చూడాలంటూ చెప్పుకొచ్చారు.