Karthi – Vijay Deverakonda : స్టేజిపై కార్తీ – విజయ్ దేవరకొండ డ్యాన్స్ చూసారా?.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ, మన విజయ్ దేవరకొండ కలిసి ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేశారు.

Karthi – Vijay Deverakonda : స్టేజిపై కార్తీ – విజయ్ దేవరకొండ డ్యాన్స్ చూసారా?.. వైరల్ అవుతున్న వీడియో..

Karthi Vijay Deverakonda Dance on Stage at Chennai Video goes Viral

Updated On : March 30, 2024 / 1:41 PM IST

Karthi – Vijay Deverakonda : సినీ పరిశ్రమలో ఒకే స్టేజిపై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది హీరోలు కలిసి కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అందులోను మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు కలిసి, స్టెప్పులేస్తే వైరల్ అవ్వాల్సిందే. తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ, మన విజయ్ దేవరకొండ కలిసి ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేశారు. నిన్న రాత్రి చెన్నైలో గలాటా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ వేడుక జరిగింది.

ఈ అవార్డు వేడుకలకు అనేకమంది తెలుగు, తమిళ్, వేరే భాషల సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ లో భాగంగా హాజరయ్యాడు. స్టేజిపై కార్తీకి అవార్డు అందించడానికి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వచ్చారు. అవార్డు తీసుకున్న అనంతరం కార్తీ, విజయ్ ని స్టెప్పులు వేయడంతో ఇద్దరూ కలిసి కార్తీ తమిళ్ సాంగ్స్ కి స్టెప్పులు వేశారు.

Also Read : Sundeep Kishan : సమ్మర్‌లో సందీప్ కిషన్ ‘వైబ్’.. మసూద టీంతో..

దీంతో కార్తీ, విజయ్ దేవరకొండ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. కార్తీ, విజయ్ అభిమానులు తమ హీరోలు ఇలా స్టేజిపై డ్యాన్స్ వేస్తుంటే సంతోషం వ్యక్తం చేస్తూ ఆ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.