×
Ad

Dimple Hayathi : దాసరి నారాయణ మా తాతయ్య.. మా నానమ్మ రవితేజ తల్లిగా.. డింపుల్ హయతి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

డింపుల్ హయతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిపింది. (Dimple Hayathi)

Dimple Hayathi

  • భర్త మహాశయులకు విజ్ఞప్తిలో డింపుల్ హయతి
  • డింపుల్ హయతి బ్యాక్ గ్రౌండ్
  • దాసరి నారాయణరావు పై డింపుల్ కామెంట్స్

Dimple Hayathi : ఖిలాడీ, రామబాణం.. లాంటి పలు సినిమాలతో హీరోయిన్ గా మెప్పించింది డింపుల్ హయతి. తాజాగా రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో రెగ్యులర్ గా వైరల్ అవుతుంది డింపుల్. ఖిలాడీ సినిమాలో బికినీ కూడా వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.(Dimple Hayathi)

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్స్ లో డింపుల్ హయతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిపింది.

Also Read : Baby Uha : చిరంజీవి కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? అబ్బాయి కాదు అమ్మాయి.. చాలా సినిమాల్లో..

డింపుల్ హయతి మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ చెప్పలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలోనే చెప్పాను. దాసరి నారాయణ రావు గారు మా తాతయ్య. మా అమ్మ వాళ్ళ నాన్నకు కజిన్ అవుతారు. మా సొంత తాతయ్య కూడా సినిమాలు చేసారు. మా ఫ్యామిలీలో చాలా మంది సినీ పరిశ్రమలో ఉన్నారు. మా అత్తలు కూచిపూడి, డ్యాన్స్ లో ఉన్నారు. మా నానమ్మ ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ప్రభ గారు. మా ఫ్యామిలీ లోనే ఆర్ట్ ఉంది. వాళ్ళందర్నీ చూసి యాక్టింగ్ మీద ఇష్టం పెరిగింది.

కిక్ సినిమాలో మా నానమ్మ ప్రభ రవితేజ అమ్మగా యాక్ట్ చేసింది. అప్పుడు నేను ఇలియానా గారికి పెద్ద ఫ్యాన్. మా నానమ్మ ఇలియానాతో ఫోన్ చేయించి నాతో మాట్లాడించింది. అప్పుడు ఇలియానా గారి చెల్లి పాత్రకు నన్ను తీసుకోవాలి అనుకున్నారు కానీ నేను చాలా చిన్నపిల్లని. అప్పుడు నేను 4 వ తరగతి ఉన్నాను. ఛాన్స్ మిస్ అయిందని బాధపడ్డాను. తర్వాత రవితేజ గారితో హీరోయిన్ గా చేశాను. ఖిలాడీ సినిమా సమయంలోనే ఇది రవితేజ గారితో కూడా చెప్పాను అని తెలిపింది.

Also Read : Parasakthi : శ్రీలీల సినిమాకు షాక్.. బ్యాన్ చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్..

డింపుల్ హయతి తెలుగమ్మాయి అని తెలుసు కానీ, ఈమెకు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.