Parasakthi : శ్రీలీల సినిమాకు షాక్.. బ్యాన్ చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్..

తమిళనాడు కాంగ్రెస్ నేతలు పరాశక్తి సినిమాపై మండిపడుతున్నారు. (Parasakthi)

Parasakthi : శ్రీలీల సినిమాకు షాక్.. బ్యాన్ చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్..

Parasakthi

Updated On : January 13, 2026 / 6:46 PM IST
  • శ్రీలీల, శివకార్తికేయన్ పరాశక్తి సినిమా రిలీజ్
  • హిందీ భాష వివాదం
  • బ్యాన్ చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్

Parasakthi : శ్రీలీల తమిళ్ లో శివకార్తికేయన్ తో పరాశక్తి అనే సినిమా చేసింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్ లోకి వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నా చివరి నిమిషంలో ఆపేసారు. తమిళనాడులో ఈ సినిమా అనుకున్నంతగా ఆడట్లేదు. అయితే ఈ సినిమాపై తమిళనాడులోనే విమర్శలు వస్తున్నాయి.(Parasakthi)

పరాశక్తి సినిమా 1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనలు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆల్రెడీ సెన్సార్ బోర్డు 23 కట్స్ విధించింది. అయినా ఈ సినిమాలో చూపించిన సీన్స్ కి విమర్శలు వస్తున్నాయి.

Also See : Nupur Sanon : మొన్న క్రిస్టియన్ పద్దతిలో.. నిన్న హిందూ పద్దతిలో.. పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..

తమిళనాడు కాంగ్రెస్ నేతలు పరాశక్తి సినిమాపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ని వక్రీకరిస్తూ ఈ సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయని, వాటిని డిలీట్ చేయాలని లేదా సినిమాని బ్యాన్ చేస్తామని తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

తమిళనాడు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలు పరాశక్తి గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో కాంగ్రెస్ నేతలను వక్రీకరించి చూపించారని, పోస్ట్ ఆఫీస్ ఫామ్స్ లో కేవలం హిందీని మాత్రమే అనుమతించినట్టు తప్పుగా చూపించారని, కాంగ్రెస్ ని అప్రతిష్టపాలు చేయడానికే ఇలా చేసారని, ఉద్దేశపూర్వకంగానే సృష్టించిన కల్పిత కథ అని, ఇందిరా గాంధీ తమిళనాడుకు రాని సందర్భాల్లో కూడా వచ్చినట్టు చూపించారని, సినిమాలో రియల్ కాంగ్రెస్ నాయకుల ఫొటోలు చూపించారని, తమిళనాడులో 200 మందిని కాల్చి చంపినట్టు కాంగ్రెస్ ని తప్పుగా చూపించారని విమర్శలు చేస్తూ ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ పిలుపు ఇచ్చారు.

Also Read : Director Maruthi : ట్రోల్స్ చేసే వాళ్ళు ఏదో ఒకరోజు అనుభవిస్తారు.. మారుతి వ్యాఖ్యలు వైరల్..

దీంతో తమిళనాడు కాంగ్రెస్ నేతలు పరాశక్తి సినిమాపై విమర్శలు చేస్తూ, బ్యాన్ చేయాలంటూ, క్షమాపణలు చెప్పాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీనిపై మూవీ టీమ్ స్పందిస్తుందా చూడాలి. ఇక మరోవైపు హిందీ తమిళ ప్రజల మీద రుద్దినట్టు తప్పుగా చూపించారని హిందీ ప్రేక్షకుల నుంచి, నార్త్ నాయకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.