Anudeep KV. రూట్ మార్చిన జాతిరత్నాలు డైరెక్టర్.. లేడీ ఓరియెంటెడ్ మూవీతో వస్తున్న అనుదీప్.. హీరోయిన్ ఎవరంటే?

లేడీ ఓరియెంటెడ్ కథతో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్న దర్శకుడు అనుదీప్ కేవీ(Anudeep KV).

Director Anudeep planning a female-centric movies

  • వరుస ప్లాప్స్ తో రూట్ మార్చిన అనుదీప్
  • లేడీ ఓరియెంటెడ్ కథతో డిఫరెంట్ గా
  • క్రేజీ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన

Anudeep KV: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన కామెడీ శైలిని ఏర్పరచుకున్న డైరెక్టర్ అనుదీప్ కె.వి(Anudeep KV). పిట్టగోడ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ దర్శకుడు, ‘జాతిరత్నాలు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా అందించిన గుర్తింపుతో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్, ఫంకీ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Dhurandhar 2 OTT: బ్లాక్ బస్టర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

వరుసగా రెండు ఫెయిల్యూర్లు ఎదురుకావడంతో, రేస్ లో కాస్త వెనుకపడ్డాడు అనుదీప్. అందుకే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సమయం పడుతుందని అంతా భావించారు. కానీ, ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాకు అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో అనుదీప్ తన నెక్స్ట్ మూవీని తెరకెక్కించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

కానీ, ఈసారి తన రెగ్యులర్ కామెడీ ఫార్మాట్‌ను పక్కన పెట్టి, సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారట అనుదీప్. ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం కేవలం వినోదాత్మక చిత్రాలకే పరిమితమైన అనుదీప్, ఈసారి డిఫరెంట్ జానర్‌లో సినిమా చేస్తుండటం విశేషం అనే చెప్పుకోవాలి. ఒకవేళ ఈ ప్రయోగం కనుక వర్కవుట్ అయితే, అనుదీప్ కెరీర్‌కు మళ్ళీ ట్రాక్ ఎక్కడం ఖాయం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్