Director Atlee-Priya: దర్శకుడు అట్లీ ఇంటికి మహాలక్ష్మి.. ఆడబిడ్డ పుట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్
Atlee Priya Welcome Baby Girl: తమిళ దర్శకుడు అట్లీ(Atlee- Priya) తనకు ఆడపిల్ల పుట్టింది అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
- V Santhosh Kumar
- Updated on- April 20, 2026 / 03:29 PM IST
Director Atlee wife Priya gives birth to a baby girl
Director Atlee – Priya: ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ కుమార్ భార్య కృష్ణ ప్రియా పండంటి ఆడపిల్లకు జన్మానించారు. ఈ విషయాన్ని స్వయంగా అట్లీ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ. తమ కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని, దేవుడి ఆశీస్సులు లభించాయని పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 20న తమకు ఆడబిడ్డ జన్మించినట్లు అట్లీ, ఆయన భార్య ప్రియ(Atlee- Priya) అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు అట్లీ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
*మొండిగా నిలబడే ఏకైక దర్శకుడు.. పూరి 26 ఏళ్ల ప్రయాణంపై విజయ్ సేతుపతి ఎమోషనల్ నోట్
వృత్తిపరంగా చూసుకుంటే, అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ‘రాకా’ (Raaka) అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట సెన్సేషన్ సృష్టించింది. ఇందులో బన్నీ మొట్టమొదటిసారిగా గుండుతో, జంతువుల గోర్ల వంటి విభిన్నమైన లుక్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
