Puri @26: మొండిగా నిలబడే ఏకైక దర్శకుడు.. పూరి 26 ఏళ్ల ప్రయాణంపై విజయ్ సేతుపతి ఎమోషనల్ నోట్
పూరీ జగన్నాధ్ 26(Puri @26) ఏళ్ళ సినిమా ప్రయాణంపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన విజయ్ సేతుపతి.
Vijay Sethupathi Emotional Note on Puri Jagannadh 26 Year Cinematic Journey
- ఇండస్ట్రీలో 26 ఏళ్ళు పూర్తిచేసుకున్న పూరి
- ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విజయ్ సేతుపతి
- స్లమ్‌డాగ్ మూవీ నుంచి స్పెషల్ ఫోటోలు షేర్
Puri @26: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న డాషింగ్ అండ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది పూరీ జగన్నాథ్. హీరోలకి సరికొత్త క్యారెక్టర్స్ క్రియేట్ చేయడంలో ఆయన స్టైల్ వేరు. తాజాగా ఆయన సినీ ప్రస్థానంలో 26 ఏళ్లు(Puri @26) పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఆయనకు అరుదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ ధైర్యాన్ని, ఆయన పనిచేసే తీరును ప్రశంసిస్తూ సేతుపతి ఒక హృదయపూర్వక నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Anantha Sriram: ఒక్క పాట.. రూ.19 లక్షల రాయల్టీ.. గీత గోవిందం పాటతో అనంత శ్రీరామ్ భారీ సంపాదన
పూరీ జగన్నాథ్ అలుపెరగని ప్రయాణాన్ని అభినందిస్తూ, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్ర షూటింగ్ అనుభవాలను విజయ్ సేతుపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పూరీ జగన్నాథ్ తన సినిమాల్లో వినిపించే నిర్భయమైన గొంతుక, నటీనటులను వారి పరిమితులకు మించి కష్టపడేలా చేసే ఆయన సామర్థ్యం అద్భుతమని కొనియాడారు. షూటింగ్ సెట్స్‌లో పూరీ చూపే చొరవ, సృజనాత్మకత తనను ఎంతో ప్రభావితం చేశాయని చెబుతూ, సదరు సినిమా షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, పాత్రల చిత్రణలో పూరీ జగన్నాథ్ చూపే వైవిధ్యం భారతీయ సినిమాలో ఆయనను ప్రత్యేకంగా నిలుపుతుందని సేతుపతి అభిప్రాయపడ్డారు. 26 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మొండిగా ముందుకు సాగడం పూరీకే సాధ్యమని పేర్కొన్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల కాంబోలో వస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా సేతుపతి షేర్ చేసిన వర్కింగ్ స్టిల్స్, ఎమోషనల్ నోట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
