Anantha Sriram: ఒక్క పాట.. రూ.19 లక్షల రాయల్టీ.. గీత గోవిందం పాటతో అనంత శ్రీరామ్ భారీ సంపాదన
అనంత శ్రీరామ్(Anantha Sriram) రాసిన ఒకే ఒక పాటకు సోషల్ మీడియా నుంచి ఏకంగా రూ.19 లక్షల రాయల్టీ వచ్చిందట.
Anantha Sriram earned 19 lakhs reality with Geetha Govindam song
- అనంత శ్రీరామ్ క్రియేట్ చేసిన సరికొత్త రికార్డ్
- తెలుగు సినీ చరిత్రలో మొదటిసారి
- అనంత శ్రీరామ్ వెల్లడించిన రాయల్టీ లెక్కలు
Anantha Sriram: ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గురించి, ఆయన రాసిన పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతూ ఆయన రాసే పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఆయన రాసిన పాటల్లో ప్రత్యేకమైన సాంగ్ అంటే ‘గీత గోవిందం’ చిత్రంలోని “ఇంకేమింకేమింకేం కావాలే” పాట అనే చెప్పాలి. అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఈ పాట ఒక సెన్సేషనే. అయితే, ఈ ఒక్క పాట ద్వారానే ఆయనకు ఏకంగా రూ.19 లక్షల రాయల్టీ లభించిందట.
దీని గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు అనంత్ శ్రీరామ్(Anantha Sriram). ఇటీవల ఆయన ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొని ఈ సాంగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ రూ.19 లక్షలు సినిమా కోసం తీసుకున్న పారితోషికం కాదని, కేవలం డిజిటల్ మాధ్యమాల్లో ఈ పాట సాధించిన ప్రజాదరణకు ప్రతిఫలంగా రచయితకు దక్కిన రాయల్టీ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగు సినీ చరిత్రలో ఒక లిరికల్ వీడియో 100 మిలియన్ల వ్యూస్ దాటడం ఈ పాటతోనే మొదలైందని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ పాట ఇంటర్నేషనల్ లెవల్లో చాట్ బస్టర్ సాధించడానికి గల ప్రధాన కారణం దానిలోని ‘యూనివర్సల్ అప్పీల్’ అని అనంత శ్రీరామ్ వివరించారు. కేవలం ప్రేమికులకే కాకుండా, జీవితంలో విజయం సాధించిన విద్యార్థులకు, లాభాలు గడించిన వ్యాపారులకు ఇలా ప్రతి ఒక్కరికీ ఈ సాహిత్యం తమ సొంత అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. సాహిత్యం ఏ సందర్భానికైనా సరిపోయేలా ఉన్నప్పుడే అది ఎక్కువ సార్లు ప్లే అవుతుందని, అలా ప్లే అయిన ప్రతిసారి రచయితకు నిర్ణీత మొత్తంలో రాయల్టీ అందుతుందని వెల్లడించారు. దీంత, ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
