×
Ad

Hrithik- Bobby: క్రిష్ 4 పక్కన పెట్టేసిన హృతిక్.. బాబీతో హాలీవుడ్ రేంజ్ మూవీ.. కన్ఫర్మ్ చేసిన కోన వెంకట్

హ్రితిక్ రోషన్, బాబీ కొల్లి(Hrithik- Bobby) కాంబోలో ఓ సినిమా చేస్తున్నట్టుగా చెప్పిన రచయిత కోన వెంకట్.

Director Bobby kolli doing a huge movie with Hrithik roshan

  • హృతిక్ కోసం భారీ కథను సిద్ధం చేసిన బాబీ కొల్లి
  • త్వరలోనే అధికారిక ప్రకటన
  • కన్ఫర్మ్ చేసిన రచయిత కోన వెంకట్

Hrithik- Bobby: దర్శకుడు బాబీ కొల్లి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ ఆ తరువాత వరుసగా భారీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కమర్షియల్ సినిమాలు చేయడంలో మనోడు టాప్. పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్, వెంకటేష్- నాగ చైతన్యతో వెంకీ మామ లాంటి సినిమాలు చేశాడు ఈ దర్శకుడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేశాడు ఈ దర్శకుడు. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవితో గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు బాబీ.

Rakul Preet Singh: నాకు బ్రతుకునిచ్చిన భాష తెలుగు.. నా మాతృభాష కన్నా ఎక్కువ.. రకుల్ ఎమోషనల్ కామెంట్స్

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే, దర్శకుడు బాబీ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik- Bobby) కోసం ఒక కథను వినిపించాడట. ఆ కథ వినగానే హృతిక్ ఎగిరిగంతేశాడట. ఆలాగే దర్శకుడు బాబీపై ప్రశంసలు కురిపించాడట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ అధికారికంగా చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోన వెంకట్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. “బాబీ హృతిక్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కథను నేను, బాబీ, చక్రవర్తి రెడ్డి కలిసి తయారుచేస్తున్నాం.

హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బాబీ. బాబీ చెప్పన కథ వినగానే హృతిక్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. అసలు ఎం తింటున్నావ్, ఎమ్ ఆలోచిస్తున్నావ్ అంటూ బాబీపై ప్రశంసలు కురిపించాడు” అంటూ చెప్పుకొచ్చాడు కోన వెంకట్. దీంతో, కొన వెంకట్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మెగాస్టార్ సినిమా కంప్లీట్ అవగానే హృతిక్ రోషన్ తో సినిమాను మొదలుపెట్టనున్నాడు బాబీ. ఇక హృతిక్ రోషన్ సైతం తాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్ 4ని పక్కన పెట్టి మరీ ఈ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట.