Rakul Preet Singh: నాకు బ్రతుకునిచ్చిన భాష తెలుగు.. నా మాతృభాష కన్నా ఎక్కువ.. రకుల్ ఎమోషనల్ కామెంట్స్
తెలుగు భాషపై, తెలుగు సినిమాలపై ప్రశంసలు కురిపించిన స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).
Rakul Preet Singh interesting comments on the Telugu language
- తెలుగు భాషపై రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నాకు జీవనోపాధినిచ్చిన భాష అంటూ ప్రశంసలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తరువాత వరుస ఆఫర్స్ దక్కించుకొని స్టార్ హీరోయిన్(Rakul Preet Singh) గా ఎదిగింది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్స్ అందరితో సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో మిగతా హీరోయిన్స్ కి అసలు ఛాన్స్ లు లేకుండా చేసింది ఈ అమ్మడు. కానీ, ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ, టాలీవుడ్ కు దూరం అయ్యింది.
Bellamkonda Sreenivas: పెళ్లిచేసుకోబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. అమ్మాయి ఎవరో తెలుసా?
బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తెలుగు భాష గురించి, తెలుగు సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను తెలుగు భాషను ఎలా మర్చిపోగలను. నేను తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలను. నా మాతృభాషా పంజాబీ కన్నా తెలుగు స్పష్టంగా మాట్లాడతాను. ఒక్కోసారి నేను పంజాబీ మాట్లాడుతుంటే మధ్యలో తెలుగు పదాలు కూడా వస్తూ ఉంటాయి.
అలాగే, తెలుగు నాకు బ్రతుకునిచ్చిన భాష. అక్కడే నాకు ఎక్కువ ఆదరణ లభించింది. అలాని భాషను ఎలా మర్చిపోగలను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. దీంతో, తెలుగు భాషపై ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. అయితే, తెలుగు గురించి ఈ అమ్మడు ఈ సమయంలో మాట్లాడింది అంటే తెలుగులో ఏదైనా సినిమా చేస్తుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆమె తెలుగు సినిమాలో చేయాలని ఆమె ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
