Pawan Kalyan: డైరెక్టర్ బాబీతో పవన్ మూవీ.. ఈ అత్యవసర మీటింగ్ అందుకోసమేనా?
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను కలిసిన సందర్బంగా ఎమోషనల్ కామెంట్స్ చేసిన దర్శకుడు బాబీ కొల్లి.
- V Santhosh Kumar
- Published On : April 8, 2026 / 06:24 PM IST
director bobby kolli met pawan kalyan and shared an emotional post
- పవన్ కళ్యాణ్ ని కలిసిన డైరెక్టర్ బాబీ
- హోదా మారింది కానీ ఆత్మీయత మారలేదని వ్యాఖ్య
- డిప్యూటీ సీఎంను చూసి భావోద్వేగానికి లోనైన బాబీ!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను దర్శకుడు బాబీ కలిశారు. అనంతరం ఆ భేటీకి సంబంధించిన అనుభూతిని సోషల్ మీడియాలో అత్యంత భావోద్వేగంగా పంచుకున్నారు బాబీ. హోదాలు మారినా పవన్ కళ్యాణ్‌లో కొంచం కూడా మార్పు రాలేదని, ఆయనలోని ఆత్మీయత అలాగే ఉందని బాబీ కొనియాడారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమయంలో చూసిన పవన్ కళ్యాణ్ కు, నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు మధ్య ఉన్న ఆత్మీయ తనను ఎంతగానో కదిలించిందని ఆయన పేర్కొన్నారు.
Varanasi: లీకైన ‘వారణాసి’ సినిమా కథ.. కాశీ నుంచి గ్లోబల్ మిషన్ వరకు.. రాజమౌళి మైండ్ బ్లోయింగ్ విజన్
పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా, ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన ఒక ‘కర్మయోగి’లా కనిపించారని బాబీ ప్రశంసించారు. అధికారంలోకి రాగానే ఆస్తులు పెంచుకునే ప్రస్తుత కాలంలో, ఉన్న సౌకర్యాలను సైతం వదులుకుని సామాన్యుడి కోసం నిలబడటం ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన చిరునవ్వు వెనుక ఉన్న నిబద్ధత తనను ఒక శిఖరంలా ఆకట్టుకుందని భావోద్వేగానికి లోనయ్యారు.
చరిత్రలో గౌతమ బుద్ధుడు శాంతి కోసం రాజభోగాలను ఎలా త్యాగం చేశారో, నేడు పవన్ కళ్యాణ్ ప్రజాక్షేమం కోసం తన సినిమా గ్లామర్ ను, వ్యక్తిగత సుఖాలను త్యాగం చేశారని బాబీ పోల్చారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయన నిజమైన ప్రజా నాయకుడని కొనియాడారు. “జైహింద్.. లవ్ యు ఆల్వేస్ మై పవర్ స్టార్” అంటూ బాబీ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం పవన్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తూ నెట్టింట వైరల్ అవుతోంది.
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం…
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు…ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు…
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న… pic.twitter.com/pt79dmsRNf— Bobby (@dirbobby) April 8, 2026
