Director Bobby updates on Balakrishna NBK 109 Title teaser
Balakrishna NBK 109 : అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లతో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన బాబీ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ డైరెక్టర్ బాబీ ఇచ్చాడు. ఈ చిత్రంలోని ఓ కీలక సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల జైపూర్‌లో షూట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సీక్వెన్లో బాలకృష్ణ విశ్వరూపం చూపించారన్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ తెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బాలకృష్ణతో కలిసి ఉన్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
Kanguva Trailer : ‘కంగువ’లో కార్తీ.. ట్రైలర్లో కనిపెట్టేశామంటున్న ఫ్యాన్స్.. మీరూ చూశారా?
దీంతో ఈసినిమా టైటిల్ ఎలా ఉంటుందోనని. టీజర్ ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Wrapped up one of the most intense schedules of #NBK109 in Jaipur with the one and only #NandamuriBalakrishna Garu!
His unmatched energy lit up every moment..Get ready to witness the rage of #NBK Garu in these electrifying sequences. 🔥🔥
TITLE TEASER COMING SOON! 🤘@thedeol… pic.twitter.com/hVtL4uufM1
— Bobby (@dirbobby) August 12, 2024