Kanguva Trailer : ‘కంగువ’లో కార్తీ.. ట్రైలర్‌లో కనిపెట్టేశామంటున్న ఫ్యాన్స్.. మీరూ చూశారా?

కంగువ ట్రైలర్ చివరల్లో తెల్ల గుర్రంపై వస్తున్న వ్యక్తిని చూసి సూర్య నవ్వుతూ కనిపిస్తాడు. గుర్రంపై వచ్చే వ్యక్తి ముఖాన్ని ట్రైలర్‌లో స్పష్టం చూపించలేదు.

Kanguva Trailer : ‘కంగువ’లో కార్తీ.. ట్రైలర్‌లో కనిపెట్టేశామంటున్న ఫ్యాన్స్.. మీరూ చూశారా?

Karthi in Kanguva trailer Fans convinced they spotted Suriya brother

Updated On : August 12, 2024 / 4:44 PM IST

Karthi in Kanguva trailer : తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ ‘కంగువ’ ట్రైలర్ విడుదలయింది. అయితే ట్రైలర్ చూసిన సూర్య ఫ్యాన్స్ డబుల్ ఖుషీగా ఉన్నారు. సూర్య తమ్ముడు కార్తీ కూడా ఈ సినిమాలో ఉన్నాడని అభిమానులు అంటున్నారు. 2 నిమిషాల 37 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌లో కార్తీని కనిపెట్టేశామని చెబుతున్నారు. సిరుత్తై శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యానిమల్ సినిమాతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించాడు.

ఈరోజు విడుదలైన ‘కంగువ’ ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. ట్రైలర్ చివరల్లో తెల్ల గుర్రంపై వస్తున్న వ్యక్తిని చూసి సూర్య నవ్వుతూ కనిపిస్తాడు. గుర్రంపై వచ్చే వ్యక్తి ముఖాన్ని ట్రైలర్‌లో స్పష్టం చూపించలేదు. అయితే ఆ వ్యక్తి కార్తీ అని అభిమానులు అంటున్నారు. ‘కంగువ’ పార్ట్ వన్‌లో కార్తీ నటిస్తున్నట్టు గతంలోనే రూమర్లు వచ్చాయి. దీంతో ఈ సినిమాలో కార్తీ ఉన్నానని ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు. కొంతమంది అయితే ‘కంగువ 2’లో బ్రదర్స్ ముఖాముఖి తలపడతారని ఊహించేస్తున్నారు. కాగా, ‘కంగువ’కు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ శివ ఇప్పటికే వెల్లడించారు.

Also Read : ఫ్రెండ్స్‌తో బీటెక్ చదుతున్నప్పటి ఫోటో షేర్ చేసిన డైరెక్టర్.. ఎవరో గుర్తుపడతారా?

ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కంగువ’ సినిమా అక్టోబర్ 10న ధియేటర్లలో విడుదలకానుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో దిశా పటాని ముఖ్యపాత్రలో నటించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ‘కంగువ’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారు ఊహించినట్టుగానే ఈ సినిమాలో కార్తీ కూడా ఉంటే ఫ్యాన్స్‌కు పండగే మరి.