Kanguva Trailer : ‘కంగువ’ ట్రైలర్ వచ్చేసింది.. బాబోయ్ సూర్య అదరగొట్టేసాడుగా..
తాజాగా కంగువ ట్రైలర్ ని విడుదల చేసారు.

Suriya Bobby Deol Kanguva Trailer Released
Kanguva Trailer : తమిళ్ స్టార్ హీరో సూర్య, తమిళ మాస్ డైరెక్టర్ శివ కాంబోలో తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా కంగువ ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు కూడా కంగువ ట్రైలర్ చూసేయండి..
ఇక ఈ ట్రైలర్ లో రెండు జాతుల మధ్య భారీ యుద్ధ సన్నివేశాలు చూపించారు. ఓ పక్క సూర్య, మరో పక్క బాబీ డియోల్ అదరగొట్టేసినట్టు తెలుస్తుంది. నేలపై, సముద్రంలో యాక్షన్ సీన్స్ మాత్రం భారీగా ఉండబోతున్నట్టు కంగువ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక కంగువ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది.