Buchi Babu Sana: మిత్రుడి ఐడియాతో పెద్ద హీరో సినిమా.. బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా అదేనా.. హీరో ఎవరో..
నేను, సుకుమార్ సార్ కారులో వెళుతుంటే విక్రమ్(Buchi Babu Sana) నాతో ఒక ఐడియా చెప్పాడు. ఆ ఐడియా ఆధారంగా కథను డెవలప్ చేశాను. ఓ పెద్ద హీరోతో ఆ కథను తెరకెక్కించాలని ఉంది
- V Santhosh Kumar
- Published On : November 30, 2025 / 05:38 PM IST
Director Buchibabu Sana made interesting comments about his next film after Peddi.
Buchi Babu Sana: డైరెక్టర్ బూచిబాబు సన.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సెన్సేషన్స్. చేసింది ఒక సినిమానే కానీ, క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో సంపాదించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియా శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ దర్శకుడు మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా తన నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు ఈ దర్శకుడు. తాజాగా బుచ్చిబాబు సన(Buchi Babu Sana) ‘సఃకుటుంబానాం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.
Malavika Mohanan: బ్లాక్ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. ఫోటోలు
ఈ సందర్బంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. “నేను, శ్రీను, విక్రమ్ చాలా కాలంగా స్నేహితులం. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు సుకుమార్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసాం. విక్రమ్ స్నేహితుడే ఉదయ్. విక్రమ్ ఇచ్చిన చిన్న ఐడియాతోనే ‘సఃకుటుంబానాం’ సినిమా చేశామని ఉదయ్ చెప్పాడు. ఆ మాట వినగానే చాలా ఎమోషనల్ అయ్యాను. కొన్ని రోజుల క్రితం నేను, సుకుమార్ సార్ కారులో వెళుతుంటే విక్రమ్ నాతో ఒక ఐడియా చెప్పాడు. ఆ ఐడియా ఆధారంగా కథను డెవలప్ చేశాను. ఓ పెద్ద హీరోతో ఆ కథను తెరకెక్కించాలని ఉంది”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బుచ్చిబాబు చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
దీంతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా అదే కథతో రానుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఈ సినిమాలో హీరోగా ఎవరు చేస్తున్నారు అనేది క్లారిటీ రాలేదు. స్టార్ హీరో అని బుచ్చిబాబు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రానుంది అనేది మాత్రం గ్యారంటీ. ఇక పెద్ది విషయానికి వస్తే, ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
