Arjun Kalyan : హీరో అన్నాడు.. కట్ చేస్తే డబ్బులతో పారిపోయాడు.. అర్జున్ కళ్యాణ్ ని మోసం చేసిన డైరెక్టర్..

Bigg Boss Arjun Kalyan: ఈ క్రమంలో తన కెరీర్ ఆరంభంలో ఓ డైరెక్టర్ చేసిన మోసం గురించి చెప్పాడు. (Arjun kalyan)

  • Updated on- April 27, 2026 / 11:06 AM IST

Director Cheated Bigg Boss Fame Actor Arjun kalyan and his Producer

Bigg Boss Arjun Kalyan: మొదట పలు సినిమాలు చేసి ఆ తర్వాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫేమ్ తెచ్చుకున్నాడు అర్జున్ కళ్యాణ్. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని అనంతరం పలు టీవీ షోలు, సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. అర్జున్ కళ్యాణ్ తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ లో జరిగిన పలు సంఘటనలను పంచుకున్నాడు.

ఈ క్రమంలో తన కెరీర్ ఆరంభంలో ఓ డైరెక్టర్ చేసిన మోసం గురించి చెప్పాడు.

Also Read : మోకాళ్ళ మీద కూర్చొని.. స్టేజిపై ధనుష్ లేడీ ఫ్యాన్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..

అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను ఒక మూవీ ఓకే చేశాను. నేను హీరోగా ఆ సినిమా ఓకే అయింది. డైరెక్టర్ కి చాలా హెల్ప్ చేశాను. కాస్టింగ్ విషయంలో సపోర్ట్ చేశాను. మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. ఓపెనింగ్ అయ్యాక ఆ డైరెక్టర్ నిర్మాత దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయాడు. NRI నిర్మాత కావడంతో మా పేర్లు వాడి, మూవీ ఓపెనింగ్ ఫొటోలు చూపించి ఆల్మోస్ట్ 8 లక్షలు తీసుకొని మాయమైపోయాడు. మంచిగా సినిమా చేసి రిలీజ్ చేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని ఆలోచించలేదు వాడు. ఇలాంటోళ్ళు ఉంటారా ఛీ అనుకోని వదిలేసినిట్టు తెలిపాడు.