Harish Shankar: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దేశం మొత్తానికి తీవ్ర విషాదం కలిగించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ బాలుకు కన్నీటి నివాళులర్పించారు.
సినీ, రాజకీయ ప్రముఖులు బాలుతో తమ అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారున్న ప్రాంతాల నుంచే వీడియోల రూపంలో ఘన నివాళి అర్పించారు. అంతర్జాతీయ మీడియా కూడా బాలు మృతికి ఘనంగా నివాళులర్పించింది.
జాతీయ మీడియా మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందని టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ విమర్శించారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకు కౌంటర్ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు.
‘ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..
ఇరుకు సందుల్లో కాదు’.. అని ట్వీట్ చేశారు హరీష్ శంకర్.
ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..
మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..
కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..
ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK
— Harish Shankar .S (@harish2you) September 26, 2020