Sindhooram Song : ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే..’ ఇంత గొప్ప పాట సినిమా కోసం ముందు రాయలేదా? సిగరెట్ పెట్టె మీద లిరిక్స్ రాసి..

సిరిస్వెన్నెల సీతారామశాస్త్రి రచించిన 'అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా..' అంటూ రాసిన పాట ఎంతో అర్థవంతంగా ప్రశిస్తూ ఉంటుంది.

Director Krishna Vamsi Interesting Comments on Sindhooram Movie Songs and Sirivennela Seetharama Sastry

Sindhooram Song : కృష్ణవంశీ దర్శకత్వంలో 1997లో తెరకెక్కిన సినిమా సింధూరం. రవితేజ, బ్రహ్మాజీ, సంగీత.. పలువురు ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకొని ఇప్పటికి క్లాసిక్ సినిమాలా నిలిచిపోయింది. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే సింధూరం సినిమాలోని ఓ పాట ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది. ఎంతోమందికి ఆ పాట ఫేవరేట్ కూడా.

సిరిస్వెన్నెల సీతారామశాస్త్రి రచించిన ‘అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా..’ అంటూ రాసిన పాట ఎంతో అర్థవంతంగా ప్రశిస్తూ ఉంటుంది. ఈ పాట ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. సిరివెన్నెల గారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు మనతోనే ఉంటాయి. అలాంటి పాటల్లో ఒకటి సింధూరం సినిమాలోని అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. పాట. ఈ పాట గురించి ఎంతోమంది ప్రముఖులు కూడా గొప్పగా మాట్లాడారు. సిరివెన్నెల కెరీర్లో బెస్ట్ సాంగ్స్ లో ఇదొకటి. అయితే ఈ పాట గురించి దర్శకుడు కృష్ణవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Trisha – Brinda : త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్ ‘బృంద’ టీజర్ రిలీజ్.. మంచితో పోరాడాలి..

సిరివెన్నెల గారిని గుర్తుచేసుకుంటూ నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఓ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్ కృష్ణవంశీని సింధూరం సినిమాలోని ఈ పాట గురించి అడగగా కృష్ణవంశీ మాట్లాడుతూ.. అసలు ఈ పాట ముందు రాయలేదు. ప్రతి సినిమాకి సిరివెన్నెలగారికి కథ చెప్తాను. సినిమా అయ్యాక చూపిస్తాను. సింధూరం సినిమా చూసిన తర్వాత సినిమాలో ఏదో మిస్ అయింది అన్నట్టు బయటకి వచ్చి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నారు. ఏమైంది గురువుగారు అని నేను అడిగితే ఏదైనా పేపర్ ఉందా అని అడిగారు. అప్పుడు పేపర్ లేకపోవడంతో రోడ్డు మీద ఖాళీ సిగరెట్ పెట్టె కనిపిస్తే తీసుకొచ్చి ఇచ్చాను. దాని మీద ఏదో లిరిక్స్ రాసి ఇంటికి వెళ్లి గంటలో ఈ పాట రాసి ఇచ్చారు. ఓ పక్క సినిమా రిలీజ్ రెండు రోజుల్లో ఉంది. ఇంకో పక్క సిరివెన్నెల గారు ఈ పాట ఇచ్చి సినిమాలో ఫలానా చోట్ల బ్యాక్ గ్రౌండ్ లో రావాలి ఈ పాట, పాట కూడా మొత్తం ఉండాలి అని చెప్పారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. మళ్ళీ కష్టపడి బాలు గారిని పిలిపించి రికార్డింగ్ చేసి పాటతో ఎడిటింగ్ చేసాం. ఆ పాట చేర్చిన తర్వాతే సింధూరం సినిమాకు ఓ పరమార్థం వచ్చింది. ఆ పాట లేకుంటే సినిమా లేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ పాట గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అది సిరివెన్నెల గారి గొప్పతనమే అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు