Ram Charan-Prashanth Neel : మెగా మూమెంట్.. సినిమా ఫిక్స్ చేసేశారా

పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లను వారి నివాసంలో కలిశారు..

  • Updated on- October 15, 2021 / 05:30 PM IST

Ram Charan Prashanth Neel

Ram Charan – Prashanth Neel: తెలుగు సినిమా సత్తా ఏంటనేది ‘బాహుబలి’ రెండు పార్టులతో ప్రపంచానికి చాటిచెప్పారు రాజమౌళి. తర్వాత ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేసి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ కొట్టింది ‘కె.జి.యఫ్’.. అప్పటివరకు ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ వెండితెరపై చూడని కోలార్ మైనింగ్స్ బ్యాక్‌డ్రాప్ కథను ఎమోషనల్‌గా ప్రజెంట్ చేసి.. యావత్ చిత్ర పరిశ్రమ చూపు తన వైపు తిప్పుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

RC-Gowtam : ‘జెర్సీ’ డైరెక్టర్‌తో రామ్ చరణ్

ఇప్పుడు ‘కె.జి.యఫ్ 2’ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ అవకముందే రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ – మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా కన్ఫమ్ చేసేశారు.

Chiranjeevi : చిరంజీవి కోసం నిన్నటి దాకా తండ్రి.. నేడు తనయుడు..

కట్ చేస్తే, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తుంది. గురువారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మెగా కోడలు ఉపాసన గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో చిరు, రామ్ చరణ్, ప్రశాంత్ నీల్‌తో పాటు నిర్మాత డివివి దానయ్య కూడా పాల్గొన్నారు.

NANI 29 : ఈ దసరా నిరుడు లెక్క ఉండదు..

ఎన్టీఆర్ సినిమా తర్వాత డివివి దానయ్య నిర్మాణంలో మెగా పవర్ స్టార్ – పాన్ ఇండియన్ డైరెక్టర్‌ల కలయికలో ఓ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో మరో సినిమా ప్లాన్ చేశారు ప్రశాంత్.

చిరు – చరణ్‌లతో తీసుకున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘చిరంజీవి గారిని కలవాలనే నా చిన్ననాటి కోరిక నెరవేరింది. ఈ కలయిక ఏర్పాటు చేసినందుకు రామ్ చరణ్‌కు థ్యాంక్స్.. వండర్ ఫుల్ ఈవెనింగ్.. ఇవాళ ఒక లెజెండ్‌ని మీట్ అయ్యాను’ అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.