NANI 29 : ఈ దసరా నిరుడు లెక్క ఉండదు..

‘నేను లోకల్’ తర్వాత నేచురల్ స్టార్ నాని - కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న సినిమాకు ‘దసరా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు..

NANI 29 : ఈ దసరా నిరుడు లెక్క ఉండదు..

Nani 29

Updated On : October 15, 2021 / 2:28 PM IST

NANI 29: నేచురల్ స్టార్ నాని రీసెంట్‌గా ‘టక్ జగదీష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే.. సుందరానికి’ సినిమాలు చేస్తున్నాడు నాని.. ఈ రెండు సినిమాలకు సంబంధిచిన షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే నాని ఇంతలో మరో కొత్త సినిమాకి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఆ మూవీకి ‘దసరా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి.

Allu Arjun : ఈ బుల్లెట్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా

కట్ చేస్తే దసరా సందర్భంగా నాని 29వ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ ‘దసరా’ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘నేను లోకల్’ తర్వాత కీర్తి సురేష్ నానికి జోడీగా నటిస్తోంది. ‘సైరన్ ఆఫ్ దసరా’ పేరుతో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకుంటోంది.

Dussehra 2021: తెలుగు సినిమాలు.. దసరా శుభాకాంక్షలు..

‘ఈ దసరా నిరుడు లెక్క ఉండదీ బాంచాత్.. జమ్మీపెట్టి చెప్తాన్నా.. బద్దల్ బాసింగలయ్‌తయ్.. ఎట్లైతేగట్లాయె..చూసుకుందాం’ అంటూ నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. పాపులర్ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.