NTRNeel: రీ-షూట్ లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. మరోసారి ఎన్టీఆర్ మేకోవర్.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ నీల్

ఎన్టీఆర్ డ్రాగన్(NTRNeel) సినిమాలో కీలక సన్నివేశాలు రీ షూట్ చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.

Director Prashanth Neel Reshoots Key Scenes in NTR Dragon movie

  • ఎన్టీఆర్ మరోసారి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్
  • ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ రీషూట్స్
  • క్వాలిటీ కోసమే ఏడాది వాయిదా

NTRNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మూవీ ‘డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)’. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఈ ఏడాదే వస్తుందనుకున్న ఈ సినిమా అనూహ్యంగా ఏడాది పాటు వాయిదా పడటం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశమైంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అని తెలుస్తోంది.

Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో రూ.9 కోట్ల మోసం.. బిగ్ బాస్ అషు రెడ్డిపై కేసు నమోదు

పాత్ర కోసం ఎన్టీఆర్ తన బాడీ లుక్ మార్చుకోవడంలో భాగంగా ముందుగా బరువు తగ్గగా, ఆ లుక్ అంతగా సంతృప్తినివ్వకపోవడంతో మళ్ళీ కండలు పెంచి కొత్త అవతారంలోకి మారాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కొన్ని కీలక సన్నివేశాలను కూడా రీషూట్ చేయాలని టీమ్ నిర్ణయించుకుంది. స్క్రిప్ట్‌లో కూడా కొన్ని మార్పులు చేసి, మరింత క్వాలిటీతో ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్‌ను అందించాలని నీల్(NTRNeel) ప్లాన్ చేస్తున్నారు.

వేగంగా సినిమాను పూర్తి చేయడం కంటే, పర్ఫెక్షన్ ముఖ్యం అనే ఉద్దేశంతోనే ఈ రీషూట్స్, షెడ్యూల్ పొడిగింపులు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ నుండి మలయాళ నటుడు టోవినో థామస్ తప్పుకోవడం కూడా ఒక ముఖ్యమైన పరిణామం. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, సినిమా మేకింగ్ సమయం పెరగడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పకున్నాడు. దీంతో విలన్ పాత్రను సెట్ చేయాల్సిన పని ఉంది. ఈ కారణాలన్నీ కలిసి సినిమాను 2026 నుండి జూన్ 11, 2027కి వాయిదా పడేలా చేశాయి.