బ్యూటిఫుల్ పొలిటీషియన్…ఊర్మిలా పొలిటికల్ ఎంట్రీపై వర్మ

రంగీలా హీరోయిన్ ఊర్మిలా బుధవారం(మార్చి-27,2019) కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ప్రముఖ డైరక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు.హే ఊర్మిళ.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో థ్రిల్‌ అయ్యా. ఎంతో అందమైన మహిళవైన నువ్వు అందమైన రాజకీయ నాయకురాలివి కాబోతున్నావు అంటూ వర్మ ట్వీట్ చేశారు.అంతేకాకుండా  రంగీలా సినిమాలోని ‘ఆయిరే ఆయిరే…’ పాట లిరిక్స్‌ ను ట్వీట్ కు  జత చేశారు.వర్మ డైరక్షన్ లో ఊర్మిళ, ఆమిర్‌ ఖాన్‌ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన రంగీలా మూవీ 1995లో విడుదలై సూపర్ హిట్‌ అందుకుంది.

ఊర్మిళ అంటే వర్మకు ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయం తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ స్టిల్‌ ను షేర్‌ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.