Rj Balaji: తెలుగు సినిమాలపై డైరెక్టర్ నోటిదూల.. రిలీజ్ ముందు ఫుల్లు ట్రోల్స్.. అవసరమా ఇవన్నీ

వీరభద్రుడు మూవీ దర్శకుడి(Rj Balaji)పై సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్ అవుతున్న తెలుగు ఆడియన్స్.

Director Rj Balaji Shocking Comments on Tollywood movies

  • బాలాజీ పాత వ్యాఖ్యల సెగ.
  • తెలుగు సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు.
  • హీరో సూర్య సినిమాపై ప్రభావం.

Rj Balaji: దర్శకుడు ఆర్ జే బాలాజీ గతంలో తెలుగు సినిమాలపై చేసిన విమర్శలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తెలుగు చిత్రాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పాత వీడియో క్లిప్పింగ్స్‌ను చూసిన టాలీవుడ్ నెటిజన్లు, మన సినిమాలను ఎగతాళి చేసిన వ్యక్తికి ఇక్కడ ఆదరణ ఎందుకంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా మార్కెట్, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచిని తక్కువ చేసి మాట్లాడటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*Srinivasa Mangapuram: మా కుర్రోళ్లను బ్రతనివ్వరా.. మహేష్ బాబు కొడుకు జయకృష్ణ కుమ్మేశాడుగా.. రెండో సాంగ్ ప్రోమో వచ్చేసింది

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన తన కొత్త సినిమా ‘వీరభద్రుడు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆర్ జే బాలాజీ(Rj Balaji) తన పంథా మార్చుకున్నారు. తాను రామ్ చరణ్ వీరాభిమానిని అని, తెలుగు ప్రేక్షకుల సినిమా పిచ్చి తనకు ఇష్టమని చెబుతూ అందరినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ మాటలు కేవలం సినిమా ప్రమోషన్ల కోసమేనని, గతంలో మనల్ని హేళన చేసి ఇప్పుడు కలెక్షన్ల కోసం పొగడటం సరికాదని సినీ ప్రియులు విమర్శిస్తున్నారు. ఒక భాషా చిత్రాన్ని కించపరిచి, అదే మార్కెట్ నుండి లాభాలు ఆశించడం ద్వంద్వ వైఖరి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సూర్య, త్రిష వంటి క్రేజీ కాంబినేషన్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ, దర్శకుడి చుట్టూ ముసురుకున్న ఈ వివాదం ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపేలా ఉంది. మే 14న సినిమా విడుదల కానున్న తరుణంలో, ఈ నెగిటివిటీని దాటుకుని సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో లేదో అని విశ్లేషకులు చర్చిస్తున్నారు. సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవమే అయినా, దర్శకుడి పాత వ్యాఖ్యలు సినిమాకు ప్రతిబంధకంగా మారాయి. ఈ వివాదంపై ఆర్ జే బాలాజీ త్వరగా స్పందించి స్పష్టతనివ్వకుంటే సినిమాకు మరిన్ని ఇబ్బందులు తప్పవు.