Site icon 10TV Telugu

Arjith : హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ తనయుడు.. అక్క ఇప్పటికే హీరోయిన్..

Director Shankar son Arjith Shankar entry as Hero in Tamil

Arjith

Arjith : సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ వారసులు అదే పరిశ్రమలోకి రావడానికి దారి ఈజీగా దొరికినా నిలబడాలంటే మాత్రం కష్టపడాల్సిందే, లక్ ఉండాల్సిందే. ఇప్పటికే అనేకమంది హీరోలు, దర్శకులు, నిర్మాతల కొడుకులు హీరోలు అయ్యారు. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ తనయుడు హీరోగా ఎంట్రీ వ్వబోతున్నాడు.

తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్ గురించి అందరికి తెలిసిందే. అనేక సూపర్ హిట్ సినిమాలు తీసిన శంకర్ గత కొంతకాలంగా ఫ్లాప్స్ చూస్తున్నారు. శంకర్ కూతురు అదితి శంకర్ ఇప్పటికే హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు శంకర్ కొడుకు ఆర్జిత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆర్జిత్ ఆల్రెడీ మదరాసి, గేమ్ ఛేంజర్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసాడు. ఇండియన్ 2 సినిమాలో ఓ సాంగ్ లో కనిపించాడు.

Also Read : Mahesh Babu Birthady : మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. మహేష్ అరుదైన ఫొటోలు చూశారా?

ఆర్జిత్ ఇప్పటికే యాకింగ్ కోర్స్ చేసాడట. అట్లీ దగ్గర పనిచేసిన శివ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతూ ఆర్జిత్ హీరోగా ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ దసరా తర్వాత మొదలవుతుందని టాక్. ఇక ఈ సినిమాలో కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ ని హీరోయిన్ గా తీసుకుంటారని తెలుస్తుంది.

Exit mobile version