దర్శకుడు శివ తండ్రి జయకుమార్ కన్నుమూత

  • Publish Date - November 27, 2020 / 09:25 PM IST

Director Shiva Jayakumar: దర్శకులు శివ తండ్రి జయకుమార్ చెన్నైలో కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయకుమార్ శుక్రవారం మరణించారు.

‘‘ఈ వార్త చెప్పాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాం. ఈ రోజు చెన్నైలో డైరెక్టర్‌ శివ తండ్రి జయకుమార్‌ మృతిచెందారు. అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను మరో ప్రెస్‌నోట్‌లో తెలియజేస్తాము..’’ అని శివ పీఆర్‌ టీమ్‌ తెలిపారు.


‘శ్రీరామ్, నేనున్నాను, బాస్, గౌతమ్ SSC, ‘మనసు మాట వినదు’ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన శివ తెలుగులో గోపిచంద్ ‘శౌర్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ‘శంఖం’, ‘దరువు’ సినిమాలు చేశారు.


తర్వాత తమిళనాట అజిత్‌తో ‘వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం’ వంటి వరుస సూపర్ హిట్స్ తీశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘అన్నాత్తే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ తండ్రి జయకుమార్ మృతి పట్ల ‘అన్నాత్తే’ మూవీ టీమ్, కోలీవుడ్, టాలీవుడ్ సినీ పరిశ్రమ వారు సంతాపం తెలియజేస్తున్నారు.