×
Ad

Singeetam Srinivasa Rao: 94ఏళ్ల వయసులో దర్శకుడిగా.. సింగీతం శ్రీనివాస్ కొత్త సినిమా.. వీడియో విడుదల

94 ఏళ్ళ వయసులో కొత్త సినిమాను స్టార్ట్ చేసిన దర్శక జీనియస్ సింగీతం శ్రీనివాస్(Singeetam Srinivasa Rao).

Director Singeetam Srinivasa has started a new film.

  • 94 ఏళ్ళ వయసులో సింగీతం కొత్త సినిమా
  • నాగ వంశీ నిర్మాత అంతా కొత్త వాళ్ళతో
  • దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు

Singeetam Srinivasa Rao: సింగీతం శ్రీనివాస రావు.. ఈ పేరు గురించి తెలియని సినిమా లవర్ ఉండటం కష్టం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 ఇలా ఆయన చేసిన సినిమాలన్నీ అద్భుతాలే. ప్రయోగాలే. రెగ్యులర్ సినిమాలు చేయడం ఆయనకు నచ్చదు. అందుకే, ఆయన జీవితం మొత్తం అలాంటి సినిమాలు చేస్తూనే వచ్చాడు.

Ram Charan- Upasana: కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగాస్టార్ ఇంట మెగా సంబరాలు

ఇప్పుడు 94 ఏళ్ళ వయసులో కూడా మరోసారి మెగాఫోన్ పట్టుకోడానికి సిద్ధం అయ్యాడు ఈ దర్శక జీనియస్. తాజాగా ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు నాగ వంశీ వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా మొదలయ్యింది. ఈ సినిమా కూడా సింగీతం శ్రీనివాస రావు(Singeetam Srinivasa Rao) గత సినిమాల మాదిరిగానే సరికొత్తగా ఉండనుందని వీడియో చూస్తే అర్థమవుతోంది.

94 ఏళ్ళ వయసులో కూడా సింగీతం శ్రీనివాస్ ఏమాత్రం ఆ హుషారు తగ్గకుండా పనిచేయడం గొప్పగా అనిపించింది. పూర్తిగా కొత్త నటీనటులతో ఈ సినిమా రానుంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి తన 94 ఏళ్ళ వయసులో ఈ దర్శక జీనియస్ చేస్తున్న ఈ ప్రయోగం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.