దర్శకుడు శ్రీవాస్‌కి మాతృవియోగం

దర్శకుడు శ్రీవాస్ అమ్మగారు అనారోగ్యంతో కన్నుమూశారు..

  • Publish Date - February 22, 2020 / 10:37 AM IST

దర్శకుడు శ్రీవాస్ అమ్మగారు అనారోగ్యంతో కన్నుమూశారు..

దర్శకుడు శ్రీవాస్ ఇంట విషాదం నెలకొంది. శ్రీవాస్ తల్లిగారు ఓలేటి అమ్మాజి(68) w/o ఓలేటి గాంధీ. అమ్మాజి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం పశ్చిమ గోదావరిలోని స్వగ్రామం పురుషోత్తపట్నంలోని స్వగృహంలో 12.50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

అమ్మాజికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్ అమ్మాజికి రెండో సంతానం. శ్రీవాస్ తల్లిగారి మరణవార్త తెలియగానే సినీపరిశ్రమకు చెందిన పలువురు ఆయణ్ణి ఫోన్‌లో పరామర్శిస్తున్నారు.

కాగా శ్రీవాస్ ‘లక్ష్యం’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద‘, ‘లౌక్యం’, ‘డిక్టేటర్’, ‘సాక్ష్యం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజమౌళితో ‘RRR’ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కుమారుడు హీరోగా పరిచయమవుతున్న చిత్రాన్ని శ్రీవాస్ డైరెక్ట్ చేయనున్నారు.