OY Re Release : మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి.. అక్కడికే సిద్ధార్ధని తీసుకొస్తా.. ‘ఓయ్’ రీ రిలీజ్ స్పెషల్ షోపై డైరెక్టర్ ట్వీట్
'వాలంటైన్స్ డే' సందర్భంగా సిద్ధార్ధ్ హీరోగా నటించిన 'ఓయ్' రీ రిలీజైంది. ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో వేస్తున్న స్పెషల్ షోకి హీరో సిద్ధార్ధ్‌ను తీసుకువస్తానంటున్నారు డైరెక్టర్.
- Lakshmi 10tv
- Published On : February 15, 2024 / 06:38 PM IST
OY Re Release
OY Re Release : సిద్ధార్ధ్-ఆనంద్ రంగ కాంబోలో 2009లో విడుదలైంది ‘ఓయ్’ సినిమా. అప్పట్లో ఈ సినిమా అంతగా ఆడలేకపోయింది. ఫిబ్రవరి 14న ‘వాలంటైన్స్ డే’కి ఇదే సినిమాని రీ రిలీజ్ చేసారు నిర్మాతలు. ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా థియేటర్లు ప్యాక్ అయిపోయాయి. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 16న స్పెషల్ షో వేస్తున్నట్లు ఆనంద్ రంగ చెప్పారు. ఆడియన్స్ ఎక్కడకి వస్తారో అక్కడికి హీరో సిద్ధార్థ్‌ని తీసుకువస్తానని ట్వీట్ చేసారు.
Ashish Reddy : ఏడడుగులు వేసేసిన టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్..
2009 లో లవ్ ఎంటర్టైనర్‌గా విడుదలైంది ‘ఓయ్’ సినిమా. సిద్ధార్ధ్-శామిలి జోడిగా నటించిన ఈ సినిమాని ఆనంద్ రంగ డైరెక్ట్ చేశారు. అప్పట్లో ట్రాజెడీ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. చెత్త సినిమా అంటూ రిజెక్ట్ చేసారు. మళ్లీ ఇదే సినిమాను వాలంటైన్స్ డే సందర్భంగా 15 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ చేసారు. అసలు ఎవరూ ఊహించని విధంగా థియేటర్లు ఫుల్ అయిపోయాయి. జనాలు అద్భుతం అంటూ రీ రిలీజ్‌ను ఆదరించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
Suma : 25వ పెళ్లి రోజున సుమ,రాజీవ్ చెప్పిన సీక్రెట్స్
కాగా ఫిబ్రవరి 16 శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా స్పెషల్ షో చూసేందుకు సిద్ధార్ధ్ రాబోతున్నారని.. ఎక్కడైతే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారో అక్కడికి సిద్ధార్ధ్‌ను తీసుకువస్తానని డైరెక్టర్ ఆనంద్ రంగ ట్వీట్ చేశారు. ఇక సిద్ధార్ధ్‌తో సినిమా చూసి ఎంజాయ్ చేసే వాళ్లు రెడీ అవడమే ఆలస్యం అన్నమాట. ఒకప్పుడు అట్టర్ ఫ్లాప్ చేసిన కొన్ని సినిమాలు రీ రిలీజ్ తర్వాత అద్భుతమని జనాలు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జనాల నాడి కనిపెట్టడం చాలా కష్టమని సినిమా వాళ్లు చెబుతుంటారు. రీ రిలీజ్‌ల విషయంలో అదే నిజం అనిపిస్తోంది.
Siddharth will be watching #OyReRelease Friday evening show in Hyderabad. If you guys tell me where maximum of you will be, I will bring him to that show.
— anand ranga (@AnandRanga) February 15, 2024
