Ashish Reddy : ఏడడుగులు వేసేసిన టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్..
దిల్ రాజు వారసుడు, టాలీవుడ్ హీరో ఆశిష్ ఏడడుగులు వేసేసి ఒక ఇంటివాడు అయ్యిపోయాడు.

Dil Raju Brother Sirish Son Young Hero Ashish Wedding photos
Ashish Reddy : టాలీవుడ్ ప్రొడ్యూసర్ మరియు దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్.. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కిస్తున్న ఆశిష్.. ఈ మధ్యలోనే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యిపోతున్నాడు. గత సంవత్సరం నవంబర్ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ‘అద్వైత రెడ్డి’ వెలికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన ఆశిష్.. ఇప్పుడు ఆమెతో కలిసి ఏడడుగులు వేసేశారు.
ఎంగేజ్మెంట్ ని చాలా సింపుల్ గా చేసేసిన దిల్ రాజు ఫ్యామిలీ.. పెళ్లిని మాత్రం రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్రాండ్ గా జరిపించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగిన ఈ పెళ్ళికి ఇరు కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారని సమాచారం. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత పెళ్ళికి హాజరయ్యినట్లు తెలుస్తుంది.
ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హాజరు అయ్యారో తెలియాలంటే.. అఫీషియల్ ఫోటోలు బయటకి రావాల్సిందే. కాగా ఫిబ్రవరి 23న హైదరాబాద్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా రిసెప్షన్ కి హాజరయ్యి న్యూ కపుల్ ని విష్ చేయనున్నారు.
Also read : Suma : 25వ పెళ్లి రోజున సుమ,రాజీవ్ చెప్పిన సీక్రెట్స్
View this post on Instagram
ఇక ఆశిష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సెకండ్ మూవీగా ‘సెల్ఫిష్’ అనే చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యినట్లు సమాచారం. ఇక రీసెంట్ గా తన మూడో సినిమాని కూడా ఆశిష్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని అరుణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.