Site icon 10TV Telugu

Sukumar-Trivikram : ఆనాడు త్రివిక్రమ్.. ఇప్పుడు సుకుమార్.. సీన్లు అద్భుతం..!

Sukumar Trivikram

Sukumar Trivikram

Sukumar-Trivikram : పుష్ప MASSive థ్యాంక్స్ మీట్ .. ఎమోషనల్ రోలర్ కాస్టర్ లా జరిగింది. నటులు, టెక్నీషియన్లు, సెలబ్రిటీల ఎమోషనల్ జర్నీ ఇండస్ట్రీని ఆకట్టుకుంది. అల్లు అర్జున్.. సుకుమార్.. చంద్రబోస్ భావోద్వేగంతో తమ అనుభవాలు, అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు.

Read Also : Sukumar : సీన్ అదుర్స్..! చంద్రబోస్ కాళ్లు మొక్కిన సుకుమార్

రైటర్ చంద్రబోస్ కాళ్లను.. డైరెక్టర్ సుకుమార్ మొక్కడం మామూలు విషయం కాదు. సినిమా అనే షిప్ కు కెప్టెన్ లాంటి వాడు దర్శకుడు. ఒక్క హిట్ ఇచ్చాడంటే.. అందరికీ పేరొస్తుంది. అందరికీ ఆ క్రెడిట్ దక్కించిన ఘనత డైరెక్టర్‌కు దక్కుతుంది. అందరూ డైరెక్టర్ కే రుణపడి ఉంటామని చెబుతుంటారు. ఇది కామన్. కానీ… డైరెక్టరే ఓ రైటర్ గొప్పతనం గురించి పొగిడి.. ఆయన కాళ్లపై పడటం అనేది మాత్రం చిన్న విషయం కాదు. ఇది చాలా గొప్ప విషయం.

చంద్రబోస్ లోని సాహితీ శక్తి, స్పాంటేనిటీ, జ్ఞాపకశక్తి, ప్రతిభ అమోఘమంటూ ఆయన కాళ్లపై పడ్డారు సుకుమార్. పదాలను చంద్రబోస్ అలవోకగా రాసేస్తుంటారని, అల్లేస్తుంటారని పాదాభివందనం సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా దిగ్గజ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని గుర్తుచేసుకున్నారు.

కొన్నేళ్ల కిందట.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గొప్పదనం గురించి ఓ అవార్డుల వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చాలా గొప్పగా చెప్పారు. సినిమా రచయితలకు సరైన గౌరవం దక్కడం లేదని త్రివిక్రమ్ ఆవేదన వ్యక్తంచేశారు. సిరివెన్నెల లాంటి రైటర్లు ఫిలిం ఇండస్ట్రీలోనే ఉండటం వారి దురదృష్టమని.. మన అందరి అదృష్టమని చెప్పారు. సీతారామశాస్త్రి రచనా ప్రతిభ గురించి చెప్పటానికి తన వొకాబులరీ.. తనకున్న భాషా పరిజ్ఞానం కూడా సరిపోవన్నారు.

Read Also : Sirivennela : సీతారామశాస్త్రి అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు.. త్రివిక్రమ్ హిస్టారికల్ స్పీచ్..!

రైటర్లను సినీ దర్శకులు ప్రశంసించడం సాధారణమే. కానీ.. వారిలోని టాలెంట్ ను ఇలా ఆకాశానికి ఎత్తేలా ప్రశంసించడం మాత్రం చాలా అరుదు. ఆ అరుదైన గౌరవం ప్రదర్శించిన దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ లు నిజంగా గొప్ప వ్యక్తులే.

Exit mobile version