Distributors Exhibitors not interested to buy Prabhas Prashanth Neel Salaar rights
Salaar : ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ని ‘Ceasefire’ అనే పేరుతో సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. కేజీఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కలిసి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ మూవీ రైట్స్ కొనేందుకు డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పోటీపడి కొంటారు అనుకున్నారు.
Vijay Deverakonda : రజిని జైలర్ హిట్ అయ్యి.. భోళాశంకర్ ప్లాప్ అయితే.. చిరంజీవి స్థాయి తగ్గిపోదు..
కానీ రియాలిటీకి వస్తే పరిస్థితి అంతా రివర్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది. సలార్ ప్రదర్శన హక్కులు విక్రయించేందుకు డిస్టిబ్యూటర్ల, నిర్మాతలు మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా, ధర ఎక్కువగా చెబుతుండటంతో డిస్టిబ్యూటర్లు వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. సలార్ విషయంలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రభాస్ సినిమా అంటే అభిమానులు బాహుబలి రేంజ్‌ను ఊహించుకుంటారు. అయితే బాహుబలి తరువాత వచ్చిన ఏ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
Prakash Raj : చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ వైరల్ ట్వీట్.. పోలీస్ కేసు నమోదు..
సాహా, రాదేశ్యామ్, ఆదిపురుష్ ఇలా మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో డిస్టిబ్యూటర్లకు నష్టం కలిగింది. ఇక ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సలార్ విషయంలో డిస్టిబ్యూటర్లు ఆలోచిస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం సినిమా విజయం పై నమ్మకంతో కాస్త ఎక్కువ మొత్తమే డిమాండ్ చేస్తున్నారు. దీనికి డిస్టిబ్యూటర్లు.. వరుస సినిమాలు ప్లాప్ అవడం వల్ల ధర తగ్గించాలని, పాత నష్టాలు కూడా పూడ్చుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే ఈ వార్త నిజమేనా? లేదా రూమర్ అనేది తెలియదు. కానీ సలార్ వంటి మోస్ట్ అవైటెడ్ మూవీని కొనడానికి వెనకడుగు వేస్తున్నారని వార్త రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యిపోయింది.