Jani Master : జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురు..

డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టులో చుక్కెదురైంది.

District Court Ranga Reddy dismissed jani master bail petetion

డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టులో చుక్కెదురైంది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ ను న్యాయ‌స్థానం కొట్టివేసింది. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్ట‌ర్ అరెస్ట్ అయ్యారు. ప్ర‌స్తుతం చంచలగూడ జైల్‌లో ఉన్నారు.

2022 సంవ‌త్స‌రానికి గాను జాతీయ ఉత్త‌ర కొరియోగ్రాఫ‌ర్‌గా జానీ మాస్ట‌ర్ ఎంపిక అయ్యారు. ఈ నెల 8న ఆయ‌న పుర‌స్కారం అందుకోవాల్సి ఉంది. దీంతో ఈ నెల 6 నుంచి 9 వ‌ర‌కు న్యాయ‌స్థానం మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే.. ఆయ‌న‌పై అభియోగాలు రావ‌డంతో ఆయ‌న‌కు ప్ర‌క‌టించిన అవార్డును ర‌ద్దు చేస్తున్న‌ట్లు నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో మ‌ధ్యంత‌ర బెయిల్‌ను తీసుకోబోనంటూ జానీ మాస్ట‌ర్ కోర్టులో మెమో దాఖ‌లు చేశారు.

Bigg Boss 8 : ప్రేరణపై పృథ్వీ పగ.. గ‌రంగ‌రంగా నామినేష‌న్స్‌

మ‌రోవైపు రెగ్యుల‌ర్ బెయిల్ కోసం జానీ మాస్ట‌ర్ పిటిష‌న్ వేయ‌గా దాన్ని నేడు(సోమ‌వారం) న్యాయ‌స్థానం కొట్టి వేసింది.