Divi : లవ్ బ్రేకప్స్ అయ్యాయి.. లివ్ ఇన్ రిలేషన్ లో ఉండాలి.. పెళ్లిపై దివి కామెంట్స్ వైరల్..

తాజాగా దివి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. (Divi)

  • Published on- October 4, 2026 / 03:15 PM IST

Divi

Divi : మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ బిగ్ బాస్ తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది నటి దివి. ప్రస్తుతం చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా దివి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Also Read : Bhogi Teaser : శ‌ర్వానంద్ భోగి టీజ‌ర్ వ‌చ్చేసింది..

దివి మాట్లాడుతూ.. నాకు రెండు లవ్ బ్రేకప్స్ అయ్యాయి. నేను పెళ్లి చేసుకొని హ్యాపీ గా హౌస్ వైఫ్ లా ఉండాలి అని అనుకునేదాన్ని. ప్రస్తుతం అయితే బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు. నాకు కాబోయే వాడు.. ఏమున్నా నేను చూసుకుంటా అనేలా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అలాంటి అబ్బాయిని మా పేరెంట్స్ తెచ్చినా చేసుకుంటా. మా పేరెంట్స్ చూసినా డెసిషన్ నాదే. నా ఫ్రెండ్స్ చాలా మంది డైవర్స్ చేసుకున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే ఒక పర్సన్ గురించి ముందే అంతా తెలుసుకోవాలి. వాళ్ళతో కొంత ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. నేనైతే కొన్ని రోజులు ట్రావెల్ చేసి అతని గురించి తెలుసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటాను.

నాకు నచ్చిన అబ్బాయి, సెట్ అయ్యే అబ్బాయి వస్తేనే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే ఇలాగే సింగిల్ గా ఉంటాను. నాకు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండాలని ఉంది. అతని గురించి తెలుసుకొని, అతనితో ట్రావెల్ అవ్వాలని ఉంది. పెళ్లి చేసుకుంటేనే పెళ్లి కాదు. నిజాయితీగా ఇష్టపడితే అది పెళ్లి అయినట్టే. ఒక మూడేళ్లు లివ్ ఇన్ లో ఉండి తర్వాత అప్పుడు మంచిగా అనిపిస్తే పెళ్లి చేసుకుంటా. మా ఇద్దరికీ సెట్ అవుతుంది అని అనిపించినపుడు సెట్ చేసుకుంటాను అని తెలిపింది.

Also See : Viraajita : పాండిచ్చేరిలో యూట్యూబ‌ర్ విరాజిత‌.. ఫోటోలు వైర‌ల్..