Divi
Divi : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది దివి.(Divi)
త్వరలో దివి హనీ అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దివి ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
Also Read : Eesha Rebba : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఈషారెబ్బ.. ఫొటోలు..
దివి మాట్లాడుతూ.. ఉప్పు అనేది నెగిటివిటీని తీసేస్తుంది. నేను బకెట్ వాటర్ లో గళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేస్తాను. ఇంట్లో కూడా ఉప్పు పెడితే మంచిది. అవన్నీ నమ్మకాలు. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు మనం వచ్చి కాదు అంటే అయిపోదు. నా నమ్మకం, చాలా మంది నమ్మకం సముద్రపు నీళ్ళల్లో కూడా మునిగితే, సముద్ర స్నానం చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది.
సముద్ర స్నానం చేస్తే దురదలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి. అందుకే రోజూ బకెట్ లో ఉప్పు వేసుకొని స్నానం చేస్తాను నేను. అది మనలోని నెగిటివిటిని తీసేస్తుంది అని తెలిపింది. దీంతో దివి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Dhurandhar 2 Vs Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వార్..