Do Yo Know Actress Samyuktha have almost 10 Films in Hand
Samyuktha : మలయాళంలో ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన సంయుక్త హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడికి మలయాళంలో కొన్ని సినిమాలు హీరోయిన్ గా చేసినా రాని గుర్తింపు తెలుగు సినిమాల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సంయుక్త. ఆ తర్వాత బింబిసార, సర్, విరూపాక్ష, డెవిల్.. ఇలా వరుస సినిమాలతో హిట్స్ కొట్టింది.
లవ్ మీ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ సోషల్ మీడియాకు, మీడియాకు కొంచెం దూరంగానే ఉంటుంది. కేవలం సినిమా ఈవెంట్స్ ఉన్నప్పుడే మీడియా ముందుకు వస్తుంది. సోషల్ మీడియాలో కూడా రేర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తుంది. అయితే వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న సంయుక్త ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
Also Read : Retro : సినిమానే చాలా ల్యాగ్ ఉంది అంటే.. ఎడిటింగ్ లో తీసేసిన 40 నిముషాలు జత చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తారంట..
సంయుక్త చేతిలో ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమా, నిఖిల్ స్వయంభు సినిమా, లారెన్స్ బెంజ్ సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ హైందవ సినిమా, శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి, పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి సినిమా, హిందీలో మహారాణి, మలయాళంలో రామ్ సినిమాలతో పాటు ఒక ఫిమేల్ లీడ్ లో ఒక సినిమా చేస్తుంది. చేతిలో దాదాపు పది సినిమాలు పెట్టుకుంది సంయుక్త.
ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. చేతిలో పది సినిమాలు ఉన్నా ఇంత సైలెంట్ గా ఉంటుంది, స్టార్ హీరోయిన్ హోదా రావాల్సిన హీరోయిన్ అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు స్టార్ హీరోయిన్స్ కి కూడా ఇన్ని సినిమాలు లేవు. మరి ఇన్ని సినిమాలతో ఇంకెన్ని హిట్స్ కొడుతుందో సంయుక్త చూడాలి. తెలుగులో మాత్రం కచ్చితంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంటుందనే అంటున్నారు.
Also Read : Anchor Lasya : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకు కార్ కొనిచ్చిన యాంకర్ లాస్య.. ఫొటోలు చూశారా?