Site icon 10TV Telugu

Athamma`s Kitchen : అత్తమ్మాస్ కిచెన్ ఎలా మొదలైందో తెలుసా? చరణ్ అర్ధరాత్రి వచ్చి అలా అడుగుతుండటంతో..

Do You Know Back Story of Upasana and Chiranjeevi Wife Surekha Business Athamma`s Kitchen

Athamma`s Kitchen

Athamma`s Kitchen : మెగా ఫ్యామిలీ మహిళలు ఉపాసన, సురేఖ, అంజనమ్మ కలిసి కొన్నాళ్ల క్రితం అత్తమ్మాస్ కిచెన్ అనే బిజినెస్ పెట్టిన సంగతి తెలిసిందే. రెడీమేడ్ ఫుడ్ తో పాటు పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు. ఉప్మా, పులిహార, పొంగల్, రసం, పాయసం.. లాంటి సౌత్ ఇండియన్ ప్యాక్స్ ఎక్కడికైనా తీసుకెళ్లి నిమిషాల్లో హాట్ వాటర్ తో రెడీ చేసుకునే రెడీమేడ్ ఫుడ్స్ అత్తమ్మాస్ కిచెన్ లో అమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ బిజినెస్ బాగానే నడుస్తుంది.

తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అత్తమ్మాస్ కిచెన్ ఐడియా ఎలా వచ్చింది, అసలు ఎలా మొదలైందో తెలిపింది.

Also Read : Upasana : రామ్ చరణ్ కి ఉపాసన పెట్టిన లవ్ టెస్ట్ ఇదే అంట.. డేటింగ్ లో ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లమని..

ఉపాసన మాట్లాడుతూ.. మా ఇంట్లో అందరూ బాగా తింటారు, అందరూ బాగా వండుతారు. మేము వేరే కంట్రీస్ లో ఉన్నప్పుడు వరల్డ్ లో ఉన్న బెస్ట్ రెస్టారెంట్స్ కి వెళ్తాము. అయినా అక్కడ రాత్రి పూట నాకు ఇండియన్ ఫుడ్ కావాలని అడుగుతాడు చరణ్. ఆ టైంలో ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది వేరే దేశంలో. అన్ని దేశాల్లో ఇండియన్ ఫుడ్ వెతుకుతాం. రోజూ చరణ్ తినే ఫుడ్ లో ఇండియన్ ఫుడ్, ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే. బయటి దేశాలకు షూటింగ్స్ కి వెళ్లినప్పుడు కష్టపడేవాడు.

అప్పుడే అత్తమ్మాస్ కిచెన్ ఆలోచన వచ్చింది. రెడీమేడ్ ఇండియన్ ఫుడ్ తయారుచేసాము. ఎక్కడికైనా తీసుకెళ్లి జస్ట్ హాట్ వాటర్ లో వేస్తే చాలు. నేను, చరణ్, అందరూ ఇపుడు బయట దేశాలకు వెళ్తే అత్తమ్మాస్ కిచెన్ ఫ్యాక్స్ తీసుకెళ్తున్నారు. ఈ బిజినెస్ గురించి మొదట మా అత్తమ్మకు చెప్తే ఎందుకు అంది. డబ్బు కోసం కాదు, సర్వీస్ కోసం అని చెప్పాను. ఎక్కడికి వెళ్లినా మనలాగే చాలా మంది మన సౌత్ ఇండియన్ ఫుడ్ వెతుక్కోవడం కష్టం. అందుకే ఈ బిజినెస్ అని చెప్పాను. ఈ బిజినెస్ గురించి చెప్తే చరణ్, మామయ్య హ్యాపీ. ఈ బిజినెస్ కి చాలా టైటిల్స్ అనుకున్నాము. చివరకు అత్తమ్మాస్ కిచెన్ అనే టైటిల్ తో వచ్చాము అని తెలిపింది.

Also Read : War 2 Pre Release Event : వర్షం పడినా ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.. సెలబ్రిటీలు ఓకే.. కానీ ఫ్యాన్స్ తడవాల్సిందేనా?

Exit mobile version